Thursday, June 11, 2026
E-PAPER
Homeఎడిట్ పేజి‘‘వనవాసుల’’ పేరుతో కుట్ర!

‘‘వనవాసుల’’ పేరుతో కుట్ర!

- Advertisement -

భారతదేశ గిరిజన సమాజానికి వేల సంవత్సరాలుగా ‘జల్, జంగల్, జమీన్‌’తో విడదీయరాని అనుబం ధం ఉంది. అడవులను కాపాడు తూ, ప్రకృతితో సహజీవనం చేస్తూ తమ ప్రత్యేక సంస్కృతి, ఆచారాలు, సంప్రదాయాలను పరిరక్షించు కుంటూ జీవిస్తోంది. భారత రాజ్యాంగం కూడా గిరిజనుల ప్రత్యేక అస్తిత్వాన్ని గుర్తించి వారికి రాజకీయ, సామాజిక, ఆర్థిక హక్కులను కల్పించింది.750 గిరిజన తెగలు ఆచార వ్యవహారాలు తమ తమ అస్తిత్వాన్ని కాపాడుకుంటూ ఐక్యమవుతు న్నాయి. తమ హక్కులను గుర్తిస్తున్నాయి. అయితే ఇటీవల 2026 మే 24న ఢిల్లీలో కేంద్ర హోం శాఖ మంత్రి పదేపదే మాట్లాడుతూ గిరిజనులను ‘‘వనవాసులు’’గా సంబోధిస్తూ వారి అసలు చారిత్రక, రాజ్యాంగబద్ధమైన గుర్తింపును బలహీన పరిచే ప్రయత్నాలు చేశారు. హిందువులం అనే పేరుతో గిరిజన తెగల మధ్య గొడవలు సృష్టించే కుట్ర చేస్తున్నారు. ఇది రాజ్యాంగానికి వ్యతిరేకం ‘ఆదివాసి’ లేదా‘గిరిజన’ అనే పదాలు ఈ దేశపు మూలవాసుల చరిత్రను, వారి హక్కులను గుర్తుచేస్తాయి. కానీ ‘వనవాసి’ అనే పదం వారిని కేవలం అడవుల్లో నివసించే వారిగా మాత్రమే చూపించి, వారి స్వయం ప్రతిపత్తి, భూహక్కులు, సంప్రదాయ హక్కుల చారిత్రక నేపథ్యాన్ని మరుగున పడేస్తుం దనే విమర్శలు ఉన్నాయి.

శ్రీరాముడు వనవాసం పోయాడు కాబట్టి దాన్ని జోడించి ఆరెస్సెస్‌ నమ్మకాన్ని గిరిజనులపై రుద్దే ప్రయత్నమే ఢిల్లీలో అమిత్‌‌షా మాటలు. ప్రజాస్వామ్యాన్ని మేమే రక్షిస్తున్నామన్నట్టు కేంద్రం గొప్పలు చెబుతోంది. దేశంలో ఆదివాసి మహిళను రాష్ట్రపతిని చేశామని చెప్పి వారి ద్వారానే గిరిజనుల మనుగడ లేకుండా చేస్తున్నది. తీసుకువస్తున్నటువంటి యు సి సి గిరిజనులకు వర్తించదని అంటూనే అనేక రాష్ట్రాల్లో నక్సలైట్ల పేరుతో అమా యక గిరిజనులను బలిగొన్నది. బీజేపీ ప్రభుత్వం పది రాష్ట్రాలలో అడవులను నాశనం చేస్తూ ఆదాని, అంబానీలకు కట్టబెట్టింది. అనేక సంస్థల పేరుతో ఒప్పందాలు చేస్తున్నది. అనేక రాష్ట్రాలలో గిరిజనులు ఆందోళన చేస్తున్నారు. పోలీసులు, ఫారెస్ట్ అధికారుల వారిపై దాడులు చేసి జైల్లోకి పంపుతున్నారు. అడవుల్లోంచి బొగ్గు, ఇనుము, బాక్సైట్, మాంగనీస్, సున్నపు రాయి, రాగి, బంగారం, యురేనియం, ఇసుక, అలోహ, ఇంధన, అణువు తదితర ముడి సరుకులను తీస్తున్నది. దీంట్లో బలతున్నది గిరిజనులే!

దేశంలో 3007 మైనింగ్ లీజులు అమల్లో ఉన్నాయి. 2,82,356 చదరపు కిలోమీటర్ల అడవి ధ్వంసం అవుతున్నది. విస్తీర్ణంలో 0.09 శాతం భూమి బడా పెట్టుబడిదారులకు ప్రభుత్వం కట్టబెడుతున్నది. 3.12 లక్షల హెక్టార్ల అటవీ భూమి మైనింగ్ కు ఇస్తున్నది. దేశంలో 95 కంటే ఎక్కువ ఖనిజాలు తవ్వకాలు జరుగుతున్నాయి. 47 వేలకు పైగా వృక్షజాతులు, 20 వేలకు పైగా పుష్పించే మొక్కలు, ఎనిమిది వేల రకాల చెట్లు, 17 మొగ బయోడైవర్సిటీ, క్షీరదాలు, సరి కృపాలు, ఉభయచరాలు, చేపలు, కీటకాలు, పక్షి జాతులు, జంతువులు అనేకం. వీటితో పాటు గిరిజనుల మనుగడ ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి కనిపిస్తున్నది. ఆర్టికల్ 342 ప్రకారం గిరిజనుల పరిరక్షణ, రాజ్యాంగ రక్షణ, రిజర్వేషన్లు, ప్రత్యేక సంక్షేమ ఫలాలు అందజేయాలి. కానీ ప్రభుత్వం బడ్జెట్‌‌లో కేటాయించే నిధులు కూడా అరకొరగానే ఉంటున్నాయి. ఖర్చు కూడా అంతంత మాత్రమే చేయడంతో రోజురోజుకూ గిరిజనుల బతుకు అగమ్యగోచరంగా తయారవుతోంది.

భారత రాజ్యాంగంలోని ఐదవ షెడ్యూల్, ఆరవ షెడ్యూల్, అటవీ హక్కుల చట్టం-2006, పీసా చట్టం-1996 వంటి చట్టాలు గిరిజనుల హక్కులను రక్షించడా నికి రూపొందించబడ్డాయి. గ్రామ సభలకు అధికారా లివ్వడం, అటవీ వనరులపై సంప్రదాయ హక్కులను గుర్తించడం, స్వయం పాలనకు అవకాశం కల్పించడం ఈ చట్టాల ముఖ్య ఉద్దేశ్యం. ఈ హక్కులను నిర్వీర్యం చేసే ఏ చర్యైనా రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమే. ప్రజాస్వా మ్యం అంటే ప్రజల స్వరం, ప్రజల భాగస్వామ్యం, ప్రజల హక్కులకు గౌరవం. గిరిజనుల అభిప్రాయాలను పక్కనపెట్టి వారి భూములు, అడవులు, వనరులపై నిర్ణయాలు తీసుకోవడం ప్రజాస్వామ్య విలువలను దెబ్బతీస్తుంది. రాజ్యాంగం కల్పించిన హక్కులను అమలు చేయకుండా నిర్లక్ష్యం చేయడం కూడా ప్రజాస్వామ్యాన్ని కూని చేసే చర్యగానే పరిగణించాలి. అందువల్ల గిరిజనుల రాజ్యాంగబద్ధ హక్కులను పరి రక్షించడం, పీసా చట్టం, అటవీ హక్కుల చట్టాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయడం, గ్రామ సభల నిర్ణయా లకు గౌరవం ఇవ్వడం, గిరిజనుల ప్రత్యేక అస్తిత్వాన్ని కాపాడటం ప్రభుత్వాల బాధ్యత. సామాజిక న్యాయం కోసం గిరిజన సమాజం మరో పోరాటానికి సిద్ధం కావాలి.

ఎం. ధర్మనాయక్, 9490098685

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -