‘సింగీతం సినిమాలు ‘పుష్పక విమానం, ఆదిత్య 369, భైరవ ద్వీపంఇలా ఏ సినిమా తీసుకున్నా టైం లెస్ గా వుంటాయి. ఇప్పటికీ 'పుష్పక విమానం చూస్తే చాలా రిలవెంట్‌గా ఉంటుంది. బహుశా అది ఆయన ‘మాయాబజార్సినిమా నుంచి నేర్చుకున్న మెలకువ కావచ్చు. 'సింగ్ గీతం కూడా ఈ జనరేషన్ కోసం తీసిన కథలా అనిపిస్తుందిఅని దర్శకుడు, నిర్మాత నాగ్ అశ్విన్ అన్నారు. డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు 'సింగ్ గీతం'తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. వైజయంతి మూవీస్, స్వప్న సినిమా పై నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆయాన్, అహల్యా బమ్రూ, శాలిని కొండెపుడి కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఈనెల 11న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత నాగ్ అశ్విన్ మీడియాతో ముచ్చటించారు. 'సింగ్ గీతం' ప్రయాణం సింగీతం తోనే మొదలైంది. ఆయన ఈ కథను ఎప్పటినుంచో చేయాలని అనుకుం టున్నారు. కమల్ హాసన్ ని కలిసి నప్పుడు ఒక ఆసక్తికరమైన విషయం చెప్పారు. 'పుష్పక విమా నంకు ముందే ఈ కథను ఆయన కమల్ కి చెప్పారు. అయితే సింగీతంకి ఉన్న కొన్ని ప్రాజెక్టుల కారణంగా అది కుదరలేదు. ఫైనల్‌గా ఇప్పుడు మెటీరియలైజ్ అయింది.
సినిమా నిర్మించడం నా ఫస్ట్ జాబ్ కాదు. ఒక కథ నచ్చి, ఆ కథను ఇంకెవరూ చేయలేరనిపించినప్పుడే నేను నిర్మిస్తాను. ‘జాతిరత్నాలుకూడా అలాంటిదే. ఆ సమయంలో అలాంటి సినిమా ఎవరూ చేసేవారు కాదనిపించింది. ఈ సినిమా కూడా అంతే. సింగీతం విజన్‌పై, ఆయనపై ఉన్న ప్రేమతో ఈ సినిమాను చేశాను. 'మహానటి తర్వాత సింగీతం నాకు ఈ కథ చెప్పారు. ఇది ఒక ఫిక్షనల్ స్టోరీ. కుబేరపురంలో గోల్డ్ మైన్స్ ఉంటాయి. ఆ ఊరికి, ఆ గోల్డ్ మైన్స్‌కు ఉన్న కనెక్షన్ ఏమిటనేది సింగీతం సిగ్నేచర్ స్టైల్‌లో, ఆయన ట్రేడ్‌మార్క్ హ్యూమర్‌తో చెప్పడం జరిగింది. సింగీతం ఏ కథను ఆలో చించినా అందులో హ్యూమానిటీ, హ్యూమర్ రెండూ ఉంటాయి. ఈ సినిమాలో కూడా అదే టోన్ కనిపిస్తుంది.
సింగితంతో కలిసి పనిచేయడం ఒక గౌరవంగా భావిస్తున్నాను. నిజానికి ఆయనను కలవడమే గొప్ప విషయం. అలాంటిది రెండేళ్లు ఆయనతో కలిసి ప్రయాణించడం, ప్రతిరోజూ మాట్లాడడం, సినిమా తీయడం మాటల్లో చెప్పలేని ఆనందం.
ఇప్పటి యూత్‌కు ఇది కచ్చితంగా రిలవెంట్‌గా ఉంటుంది. ఇందులో డైలాగ్స్ అన్నీ పాటల్లా వస్తాయి. కానీ ప్రేక్షకులు కొద్దిసేపటికే ఆ విషయాన్ని మర్చిపోతారు. ఆ ప్రపంచంలోకి పూర్తిగా వెళ్లి పోతారు. పోస్ట్ ప్రొడక్షన్‌లో సినిమా చూశాను. ప్రతి సీన్ చాలా ఎంటర్‌టైనింగ్‌గా సాగుతుంది. వారం రోజులు చూసి మర్చిపోయే సినిమా కాదు ఇది. పదేళ్ల తర్వాత కూడా గుర్తుండే సినిమా తీయాలనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ చేశాం.
సింగీతం ఎప్పుడూ అంతర్జాతీయ స్థాయిలో ఆలోచిస్తారు. ఇలాంటి సినిమా ప్రపంచంలో ఎక్కడా రాలేదని ఆయన చెప్పేవారు. సినిమా పూర్తయ్యాక చూస్తుంటే నిజంగానే ఇలాంటి సినిమా ఇప్పటివరకు రాలేదనిపిస్తోంది. భవిష్యత్తులో కూడా ఇలాంటిది రావడం కష్టం. మన జనరేషన్‌కు సింగీతం ఈ సినిమా ఇస్తున్నారంటే అంటే మనం అదృష్టవంతులమనే చెప్పాలి.
దేవిశ్రీ ప్రసాద్ చాలా కష్టపడ్డారు. తమిళంలో రిలీజ్ అవుతోంది. మిగతా భాషల విషయానికి వస్తే ఇది చాలా కష్టమైన ప్రక్రియ. ఎందుకంటే ఇందులో డైలాగ్స్ అన్నీ పాటల రూపంలో ఉంటాయి. కాబట్టి ప్రతి భాషలోనూ వాటిని మళ్లీ సంగీతబద్ధంగా రూపొం దించాలి. మిగిలిన భాషల్లోనూ రిలీజ్ చేయాలనే ఆలోచన ఉంది.
‘కల్కి 2` ఇప్పటికే మొదలైంది. వచ్చే నెల నుంచి నిరంతరంగా షూటింగ్ చేసి, శరవేగంగా పూర్తి చేస్తాం.
ప్రపంచ సినీ చరిత్రలో ఇలాంటి సినిమా రాలేదు
- Advertisement -
- Advertisement -



