ఢిల్లీలో నాలుగేళ్ల బాలికపై లైంగికదాడి

నవతెలంగాణ – ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. 4 ఏళ్ల చిన్నారిపై 34 ఏళ్ల వ్యక్తి లైంగికదాడికి పాల్పడ్డాడు. బాలిక చదివే ట్యూషన్‌ సెంటర్‌లోని టీచర్‌ సొదరుడే ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు ప్రకటించారు. దీంతో తూర్పు ఢిల్లీలోని పాండవ్‌ నగర్‌లో ప్రజలు ఆందోళనలకు దిగారు. నిందితుడి ఇంటి వద్దకు చేరుకుని వాహనాలను ధ్వంసం చేశారు. శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. బాలిక ఏడుస్తూ వచ్చి తల్లిదండ్రులతో చెప్పడంతో ఈ దారుణం వెలుగుచూసింది. ఘటనపై కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Spread the love