
ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్ళుటకు దారి లేక దూర ప్రాంతానికి నిండు గర్భిణీ తరలించిన సంఘటన వేమనపల్లి లో చోటు చేసుకుంది. ఇటీవల కురుస్తున్న వర్షానికి ప్రాణహిత నది వరదతో సుంపుటం రహదారి నీట మునిగింది. జాజులపేట గ్రామానికి చెందిన దన్నూరి భారతి అనే నిండు గర్భిణిని ముందు జాగ్రత్త చర్యగా 108 వాహనం ద్వారా చెన్నూర్ సివిల్ ఆసుపత్రికి తరలించడం జరిగింది. భారతికి ఆగస్టు మొదటి వారంలో డెలివరీ ఉండడంతో ముందస్తుగా చెన్నూర్ అస్పత్రికి తరలించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో నీల్వాయి ఎస్ఐ శ్యామ్ పటేల్, హెల్త్ అసిస్టెంట్ రాంశెట్టి బాపు, ఆశా కార్యకర్త శారద 108 ఈఎంటీ పి రమేష్ ,పైలెట్ ఇమామ్ షరీఫ్ పాల్గొన్నారు.