సమస్యలపై మొరపెట్టుకున్నా పట్టించుకోని ప్రభుత్వం

– ప్రజలకు అందని సంక్షేమ పథకాలు
– బీజేపీ నేత గజ్జల యోగానంద్‌
నవతెలంగాణ-శేరిలింగంపల్లి
ప్రజల సమస్యలు పట్టించుకోవాలని పలుమార్లు విన్నవించుకుంటున్నా పట్టించుకోవడం లేదని బీజేపీ నేత గజ్జల యోగానంద్‌ అన్నారు.శేరిలింగంపల్లి నియోజక వర్గంలో ‘ప్రజా సమస్యలపై’ పాదయాత్ర చేపట్టి మంగళ వారం 55వ రోజుకు చేరింది. నియోజకవర్గ పరిధిలోని లింగంపల్లి డివిజన్‌ పాపిరెడ్డి కాలనీ, వాంబే బస్తీ, సందయ్యనగర్‌ల్లో డివిజన్‌ అధ్యక్షులు రాజుశెట్టి కుర్మ ఆధ్వ ర్యంలో ప్రజా సమస్యలపై పాదయాత్రలో భాగంగా ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు అందడం లేదన్నారు. డబుల్‌ బెడ్రూం ఇండ్లు, పింఛన్లు, దళితబంధు అధికార పార్టీ నాయకుల చేతుల్లోనే కరిగి పోతున్నాయని ఆరోపించారు.పింఛన్‌ కోసం దరఖాస్తు చేసుకుని ఎనిమిదేండ్లు గడుస్తున్నా వృద్ధులకు, వితంతు వులకు అందడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని కార్యకర్తలకు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సీమోర్చ రాష్ట్ర అధికార ప్రతినిధి కాంచన కృష్ణ, శేరిలింగంపల్లి డివిజన్‌ ప్రధాన కార్యదర్శి సత్య కురుమ, చందానగర్‌ డివిజన్‌ ప్రధాన కార్యదర్శి పి.శ్రీనివాస్‌, ఆల్విన్‌ కాలనీ డివిజన్‌ ప్రధాన కార్యదర్శి రఘు, శేరిలింగంపల్లి డివిజన్‌ ఉపాధ్యక్షులు బాలరాజ్‌, మియాపూర్‌ డివిజన్‌ ఉపాధ్యక్షులు రత్నకుమార్‌, ఎస్సీ మోర్చ అధ్యక్షులు భాషా శివ, బీజేవైఎస్‌ నాయకులు రామకృష్ణ తదితరులున్నారు.

Spread the love