
నిర్మల్ జిల్లా ముధోల్ మండలం లోని బోరిగాం గ్రామ పంచాయతీ కార్యదర్శి ఆనంద్ రావు బదిలీ కావడంతో శుక్రవారం మాజీ సర్పంచ్ అమృత మురళి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. గ్రామంలో ఐదు సంవత్సరాలు కార్యదర్శి పనిచేసి ప్రజల మన్ననలు పొందటం అభినందనీయం వారు అన్నారు. ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఆనంతరం బదిలీపై వచ్చిన పంచాయతీ కార్యదర్శి పద్మాజను సన్మానించి అభినందనలు తెలిపారు. గ్రామ అభివృద్ధికి కృషి చేయాలని వారు కోరారు.ఈకార్యక్రమంలో నాయకులు విఠల్,పాషా, గ్రామస్థులు పాల్గొన్నారు.