అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడు

– బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లో కాంగ్రెస్ నాయకులు

నవతెలంగాణ – మద్నూర్
అణగారిన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ అని మద్నూర్ మండలం కాంగ్రెస్ నాయకులు కొని ఆడారు. ఆయన జయంతి వేడుకలు మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం నాడు ఆయన చిత్రపటానికి నివాళులర్పించి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ ముఖ్య నాయకులు మాట్లాడుతూ అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషిచేసిన  గొప్ప మహనీయుడని కుల రహిత సమాజం కోసం కృషిచేసిన ఆయనకు నాయకులు ఘనంగా నివాళులర్పించారు. ఈ జయంతి వేడుకల్లో ధరాస్ సాయిలు సంగమేశ్వర్ పట్నాల రమేష్ గడ్డం లక్ష్మణ్ సంతోష్ పటేల్ రచ్చ కుశాల్ సచిన్ బాబు యాదవ్ రవి బండి గోపి కర్ల సాయిలు తదితరులు పాల్గొన్నారు.
Spread the love