మహిళా దినోత్సవం సందర్బంగా ఉపాధ్యాయులకు ఘన సన్మానం

నవతెలంగాణ – రెంజల్
మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని రెంజల్ మండలంలోని మహిళా ఉపాధ్యాయులను పిఆర్టియు ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం జరిపినట్లు పీఆర్ టీయూ మండల అధ్యక్షుడు టి. సోమలింగం గౌడ్ పేర్కొన్నారు. రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో మహిళ ఉపాధ్యాయులను శాలువా కప్పి పూలమాలతో ఘనంగా సన్మానం జరిపినట్లు ఆయన తెలిపారు. సన్మాన గ్రహీతలలో రెంజల్ మండలం నుంచి కే. శోభారాణి (ఎంపీపీ ఎస్) దండిగుట్ట, నాజ్ ఫాతిమా (ఎంపీపీఎస్) నీలా, ఆదర్శ పాఠశాల ఓ జ్యోతి లను సన్మానించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పీఆర్ టీయూ జిల్లా గౌరవ అధక్షులు ఇల్తేపు శంకర్, పీఆర్ టీయూ రెంజల్ మండల అధ్యక్ష కార్యదర్శులు టి. సోమలింగం గౌడ్, సాయ రెడ్డి, మండల అసోసియేట్ అధ్యక్షులు రఫిక్ హూల్ తాహెర్, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు కిషోర్ కుమార్, మండలంలోని స్థానిక ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Spread the love