విజయాన్ని శాసించే స్థాయిలో.. నేతన్న

– నేతన్న కరుణిస్తేనే నేతల గెలుపు
నవతెలంగాణ- సిరిసిల్ల
ఎన్నికలకు వేళ అయ్యింది. సిరిసిల్ల నేతన్న ..ఓటెయ్యడానికి సిద్ధమవుతున్నాడు.నేతన్నలను ప్రసన్నం చేసుకోవడానికి ఎన్నికల బరిలో నిల్చున్న అభ్యర్థులు ..పార్టీల శ్రేణులు ఆ దిశగా ప్రయత్నిస్తున్నాయి. సిరిసిల్ల నియోజక  వర్గం లో అభ్యర్ధి విజయాన్ని శాసించే స్థాయిలో ఉన్న నేతన్నలు… ఈ ఎన్నికల్లో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు సంబంధించిన వర్గాలు కీలకం కానున్న నేపథ్యంలో  ప్రత్యేక కథనం… ఎన్నికలు అనగానే ఓటర్లు గుర్తుకొస్తారు అది సహజం కానీ సిరిసిల్ల శాసనసభ నియోజకవర్గంలో పోటీ చేసే అభ్యర్థులకు మాత్రం సిరిసిల్ల నేతన్నలు గుర్తుకు వస్తారు ఎందుకంటే వస్త్ర పరిశ్రమకు కేంద్రమైన సిరిసిల్లలో పవర్లూమ్ దాని అనుబంధ రంగాలలో పనిచేసే కార్మికులే అత్యధికంగా ఉన్నారు వారంతా ఓటర్లు కావడం గమనార్వం. సిరిసిల్ల నియోజకవర్గంలో 2,48,798 మంది ఓటర్లు ఉండగా అందులో సింహభాగం నేత కార్మిక ఓటరులే ఉన్నారు దాదాపు 80 వేలకు పైగా ఓటర్లు నేత కార్మికులు ఉన్నారు దీంతో ఎన్నికల సమయంలోనైనా సాధారణ సమయాల్లో నైనా నేతన్న సామాజిక వర్గం ఎదుర్కొంటున్న ఇబ్బందులు సమస్యలపైనే తక్షణం స్పందించే పాలక ప్రతిపక్షాలు ఈ వర్గాన్ని ప్రత్యేకంగా చూస్తారు సిరిసిల్ల శాసనసభ నియోజకవర్గం అంటేనే ఇప్పుడు రాష్ట్రమంతటా హట్ సెగ్మెంట్. సిరిసిల్ల ప్రథమ శ్రేణి మున్సిపాల్ తో పాటు ఐదు నియోజకవర్గాలతో కలిసి ఉన్న ఈ సెగ్మెంట్ లో సిరిసిల్లలో అత్యధికంగా విస్తృతంగా విస్తరించబడిన నేత కుటుంబాలు మరమగ్గాలపై అద్దకం సైజింగ్ గార్మెంట్ లపై అధిక సంఖ్యలో నేత కార్మికులు వారి పిల్లలు పనిచేస్తున్నారు. వారి ఓట్లను కైవసం చేసుకోవడానికి అన్ని రాజకీయ పార్టీలు స్వతంత్ర అభ్యర్థులు ప్రయత్నాలు చేస్తున్నారు.
నేతన్న పైనే నేతల దృష్టి
సిరిసిల్ల నియోజకవర్గంలో నేతల దృష్టి నేతన్నల పైనే ఉంది ప్రతిసారి వారి ఓట్లు కీలకంగా మారడంతో ఎన్నికల్లో నేతలు వారి చుట్టూ ప్రదక్షణలు చేస్తారు 2009లో తాను అడుగు పెట్టే సమయానికి నేతన్నల బలవన్మరణాలతో సంక్షోభంలో విషాద నిలయంగా ఉన్న సిరిసిల్ల కార్మిక క్షేత్రాన్ని ఎమ్మెల్యేగా మంత్రిగా గత 15 సంవత్సరాలు తారక రామారావు పాలించారు దీంతో నేతన్నల బతుకుల్లో కొంత మార్పు వచ్చినట్లు కనిపిస్తుంది కాంగ్రెస్ బిజెపి స్వతంత్ర అభ్యర్థులు నేతన్నల ఓట్లను తమ ఖాతాలో వేసుకోవడానికి అవసరమైన వస్త్రాలను సిద్ధం చేసుకుని ప్రచార పర్వంలోకి దిగుతున్నారు నేతన్నల సంక్షేమానికి ఉద్దేశించిన పథకాలలో జరుగుతున్న అవకతవకలు పక్కదారి పడుతున్న తీరును ఎవరికి లబ్ధి కలుగుతుందో వివరిస్తూ ప్రచారం చేస్తున్నారు.
నేతన్నల వలసలు ఆగిపోయాయి
సిరిసిల్ల ప్రాంతంలోని నేత అన్నలు 2008కి ముందు భీమండి సూరత్ తదితర పవర్లూమ్ రంగప్రదేశాల కు వలసలు పోయారు సిరిసిల్ల నేతన్న ఆ తర్వాత వరుసగా మారుతూ వచ్చిన సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ తీరుతెన్నులతో వలసలు నిలిచిపోయాయి అలాగే స్వరాష్ట్రం సిద్ధించిన తర్వాత జోలి శాఖకు తానే మంత్రిగా ఉన్న స్థానిక శాసనసభ్యులు కే తారక రామారావు సిరిసిల్ల పవర్లూమ్ కు ఆధారం కల్పించాలన్న లక్ష్యంతో క్రమ పద్ధతిలో తీసుకొచ్చిన మార్పులతో సిరిసిల్లకే ఇతర రాష్ట్రాల నుంచి వలసలు వచ్చే విధంగా సిరిసిల్ల ఎదిగిపోయింది ఈ అభివృద్ధి పలాలనే ఓటర్ల ముందు ఉంచి తిరిగి సిరిసిల్ల నుంచి ఎమ్మెల్యేగా గెలిపించాలని కేటీఆర్ కోరుతున్నారు అంతే కాకుండా టిఆర్ఎస్ శ్రేణులు ఇదే విషయాన్ని ఓటర్ల ముందు తీసుకు వెళ్తూ ప్రచారం చేస్తున్నారు సిరిసిల్లలో మీద కుటుంబాల్లో మహిళలు ఇప్పటివరకు బీడీ పరిశ్రమ పై ఆధారపడి ఉండగా బీడీ ఉత్పత్తి తగ్గిన క్రమంలో సిరిసిల్ల నేత మహిళలకు గార్మెంట్ పరిశ్రమ పార్కు లో మహిళలకు ఉపాధి లభించే మార్గం ఏర్పాటు చేశారు అయినా నేత కుటుంబాలలో ఇప్పటికే నిలువ నీడ గూడు లేని నిర్భాగ్యులెందరో ఉన్నారు పెరుగుతున్న ఖర్చులకు అనుగుణంగా ఆదాయం లేని పరిస్థితిలో ప్రస్తుతం నేతన్నలు మగ్గుతున్నారు పార్టీలు ఏవైనా పాలకులు ఎవరైనా నేతన్నల ఓట్లతో గెలిచిన నేతలు వారి జీవన పరిస్థితుల్లో మార్పులు తేవాల్సిన అవసరం ఉంది.

Spread the love