బ్లాక్‌హాక్స్‌కు పరాజయం

A loss to the Blackhawks– 3-0తో చెన్నై బ్లిట్జ్‌ గెలుపు ప్రైమ్‌ వాలీబాల్‌ లీగ్‌ 2024
చెన్నై: ప్రైమ్‌ వాలీబాల్‌ లీగ్‌లో హైదరాబాద్‌ బ్లాక్‌హాక్స్‌ పరాజయం చవిచూసింది. శనివారం చెన్నైలో జరిగిన గ్రూప్‌ దశ మ్యాచ్‌లో 16-14, 15-11, 15-7తో చెన్నై బ్లిట్జ్‌ చేతిలో హైదరాబాద్‌ బ్లాక్‌హాక్స్‌ ఓటమి పాలైంది. చెన్నై కొత్త ఆటగాడు సమీర్‌ సూపర్‌ స్మాష్‌లతో చెలరేగటంతో ఆ జట్టు పైచేయి సాధించింది. హైదరాబాద్‌ కెప్టెన్‌ రంజిత్‌ సింగ్‌ మెరిసినా.. వరుస సెట్లలోనే మ్యాచ్‌ చేజారింది. ఆఖరు సెట్లో సైతం హైదరాబాద్‌ ఊరట దక్కించుకోలేదు.

Spread the love