మలేషియన్ ఎయిర్‌వేస్ విమానానికి తప్పిన పెనూ ప్రమాదం

నవతెలంగాణ – హైదరాబాద్ : శంషాబాద్ నుంచి కౌలలంపూర్ వెళ్తున్న విమానానికి ముప్పు తప్పింది. మలేషియన్ ఎయిర్ వేస్ విమానం శంషాబాద్ నుంచి కౌలలంపూర్ బయల్దేరింది. అయితే టేకాఫ్ అయిన 15 నిమిషాలకే కుడివైపు ఇంజిన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలను గుర్తించి ల్యాండింగ్‌కు పైలెట్ అనుమతి కోరారు. అనుమతి వచ్చే వరకు కొద్దిసేపు గాల్లో విమానం చక్కర్లు కొట్టింది. చివరకు ఎమర్జేన్సీ ల్యాండింగ్‌కు ఏటీసీ అనుమతించింది. ఎట్టకేలకు శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. ఘటన సమయంలో విమానంలో సిబ్బందితో పాటు 130 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలిసింది. సేఫ్ ల్యాండింగ్‌తో ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Spread the love