గొంతులో చికెన్ ముక్క ఇరుక్కోవడంతో వ్యక్తి మృతి

నవతెలంగాణ – హైదరాబాద్: గొంతులో చికెన్ ముక్క ఇరుక్కోవడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని కోఠిలో చోటుచేసుకుంది. షాద్ నగర్ అన్నారం వాసి శ్రీకాంత్(39) తన సోదరిని కలిసేందుకు హైదరబాద్ సైదాబాద్‌కు వచ్చాడు. ఓ ఫంక్షన్ ఉంది వెళ్దామని చెప్పడంతో కోఠిలోని ఓ వైన్స్‌లో శ్రీకాంత్ మద్యం తాగాడు. అనంతరం ఇష్టంగా చికెన్ బిర్యానీ తిన్నాడు. అయితే కాసేపటి తర్వాత రోడ్డు పక్కన కుప్పకూలి చనిపోయాడు. పోస్టుమార్టం రిపోర్టులో గొంతులో చికెన్ ముక్క ఇరుక్కుని శ్వాస ఆడక మృతి చెందినట్లు తేలింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Spread the love