కొలువుదీరిన సంకీర్ణం

కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం కొలువుదీరింది. దేశానికి 17వ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ప్రమాణం చేశారు. వరుసగా మోడీ ప్రధాని కావడం ఇది మూడోసారి.– మోడీ సహా 72 మంది ప్రమాణ స్వీకారం
– తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురు
– 30 మందికి క్యాబినెట్‌ హోదా
– 36 మంది సహాయ మంత్రులు
– స్వతంత్ర హోదాలో మరో ఐదుగురు
సహాయ మంత్రులు ఇంద్రజీత్‌ సింగ్‌ – హర్యానా, జితేందర్‌ సింగ్‌ – రాజస్థాన్‌, అర్జున్‌ రాం మేఘావల్‌ – రాజస్థాన్‌, ప్రతాప్‌ రావ్‌ గణపతి రావ్‌ యాదవ్‌ – మహారాష్ట్ర (శివసేన షిండే, మిత్రపక్షం), జయంత్‌ చౌదరి – రాజ్యసభ (రాష్ట్రీరు లోక్‌ దళ్‌, మిత్రపక్షం), జితెన్‌ ప్రసాద్‌ – యూపీ, శ్రీపాద్‌ యసో నాయక్‌ – గోవా, పంకజ్‌ చౌదరి – యూపీ, క్రిషన్‌ పాల్‌ – హర్యానా ,రాం దాస్‌ అత్వాలే – రాజ్య సభ (ఆర్పీఐ, మిత్రపక్షం), రాంనాథ్‌ ఠాకూర్‌ – రాజ్యసభ (జేడీయూ, మిత్రపక్షం), నిత్యానంద్‌ రారు – బీహార్‌ , అనుప్రియా పాటిల్‌ – యూపీ (అప్నాదళ్‌, మిత్రపక్షం), వి సోమన్న – కర్ణాటక , పెమ్మసాని చంద్రశేఖర్‌ – ఏపీ (టీడీపీ, ుత్రపక్షం), భూపతి రాజు శ్రీనివాస్‌ వర్మ – ఏపీ , ఎస్పీ సింగ్‌ భగేల్‌ – యూపీ (ఎస్సీ), శోభ కరణ్‌ లాజే – కర్నాటక , కీర్తీ వర్ధన్‌ సింగ్‌ – యూపీ ,బీఎల్‌ వర్మ – రాజ్యసభ, శాంతన్‌ ఠాకూర్‌ – పశ్చిమ గోదావరి, సురేశ్‌ గోపి – కేరళ, ఎల్‌. మురుగన్‌ – తమిళనాడు (ఎస్సీ), అజరు టంటా – ఉత్తరాఖండ్‌ , బండి సంజరు – తెలంగాణ, కమలేశ్‌ పాశ్వాన్‌ – యూపీ, భగీరథ్‌ చౌదరి – రాజస్థాన్‌, సతీష్‌ చంద్ర దూబే – రాజ్యసభ, సంజరు సేత్‌ – జార్ఖండ్‌, రవ్‌ నీత్‌ సింగ్‌ – పంజాబ్‌ (లుథియానా నుంచి ఓటమి), దుర్గాదాస్‌ యూకే – మధ్యప్రదేశ్‌, రక్షా నిఖిల్‌ ఖడ్సే – మహారాష్ట్ర , సుకాంత ముజుందార్‌ – పశ్చిమ బెంగాల్‌ , సావిత్రి ఠాకూర్‌ – మధ్యప్రదేశ్‌ , టోఖన్‌ సాహూ – చత్తీస్‌గఢ్‌, రాజ్‌ భూషణ్‌ చౌదరి – బీహార్‌, హర్ష్‌ మల్హోత్రా – ఢిల్లీ, నీముబెన్‌ జయంతి భారు బాంభానియా – గుజరాత్‌, మురళీధర్‌ మోహన్‌ – మహారాష్ట్ర, జార్జ్‌ కొరియన్‌ – కేరళ, పవిత్ర మార్గేరిటా – రాజ్యసభ
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం కొలువుదీరింది. దేశానికి 17వ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ప్రమాణం చేశారు. వరుసగా మోడీ ప్రధాని కావడం ఇది మూడోసారి. ఆదివారం సాయంత్రం విద్యుత్‌ కాంతుల మధ్య రాష్ట్రపతి భవన్‌లో ప్రమాణ స్వీకారం కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమంలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తొలుత ప్రధానిగా మోడీతో ప్రమాణం చేయించారు. సాయంత్రం 7:23 గంటలకు మోడీ ప్రధాన మంత్రిగా ప్రమాణం చేశారు. అనంతరం కేంద్ర మంత్రివర్గానికి సంబంధించిన అధికారికారిక పుస్తకంలో సంతకం చేశారు. తర్వాత రాష్ట్రపతి మంత్రివర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. మొత్తం 72 మందితో కూడిన మంత్రివర్గం ప్రమాణం చేసింది. ఇందులో 30 మంది క్యాబినేట్‌ మంత్రులుగా, 36 మంది సహాయ మంత్రులుగా, ఐదుగురు స్వతంత్ర హోదాలో సహాయ మంత్రులుగా బాధ్యతలు స్వీకరించారు. రాజ్యసభ నుంచి ఎనిమిది మంది ప్రమాణ స్వీకారం చేశారు.
ప్రధాని మోడీ తర్వాత వరుసగా బీజేపీ ముఖ్యనేతలు రాజ్‌నాథ్‌ సింగ్‌, అమిత్‌ షా, నితిన్‌ గడ్కరీ, జేపీ నడ్డా, శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌, నిర్మలా సీతారామన్‌ తదితరులు ప్రమాణం చేశారు. అలాగే ఎన్డీఎ కూటమిలోని సభ్యులు కూడా కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేశారు. ప్రధానితో పాటు బీజేపీ నుంచి 61 మంది ప్రమాణం చేశారు. ఇక మిత్రపక్షాలకు 11 మంత్రిపదవులు కేటాయించింది . అత్యధిక స్థానాలు గెలిచి కీలకంగా మారిన టీడీపీ, జేడీయూ, శివసేన (షిండే)కు తాలా రెండు స్థానాలు.. ఆర్‌ఎల్‌డీ, జేడీఎస్‌, అప్నాదళ్‌, హిందూస్తాన్‌ ఆవం మోర్చా, ఆర్పీఐ పార్టీల నుంచి ఒక్కో మంత్రికి స్థానం కల్పించింది. క్యాబినెట్‌లో 27 మంది ఓబీసీలు, 10 మంది ఎస్సీలు, ఐదుగురు ఎస్టీలు, ఐదుగురు మైనారిటీలు ఉన్నారు. క్యాబినెట్‌లో చేరిన 43 మందికి మూడుసార్లు మంత్రులుగా పనిచేసిన అనుభవం, 23 మందికి రాష్ట్రాల్లో మంత్రులుగా పనిచేసిన అనుభవం ఉంది.
ఏపీ నుంచి ముగ్గురు…
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి మొత్తం మూడు మంత్రి పదవులు దక్కాయి. కూటమిలో కీలకంగా వ్యవహరిస్తోన్న టీడీపీకి ఒక క్యాబినేట్‌, ఒక సహాయ మంత్రి ఇచ్చారు. ఇందులో భాగంగా వరుసగా మూడోసారి ఎంపీగా గెలిచిన రామ్మోహన్‌ నాయుడుకు క్యాబినేట్‌, పెమ్మసాని చంద్రశేఖర్‌కు సహాయ మంత్రిగా అవకాశం కల్పించారు. అలాగే బీజేపీకి చెందిన నరసాపురం ఎంపీ భూపతిరాజు శ్రీనివాస వర్మకు కూడా మంత్రి వర్గంలో సహాయ మంత్రిగా స్థానం లభించింది.
తెలంగాణ నుంచి ఇద్దరికి..
తెలంగాణ నుంచి ఇద్దరిని మంత్రి పదవులు వరించాయి. రెండోసారి కేంద్ర మంత్రిగా కిషన్‌ రెడ్డి ప్రమాణం చేశారు. బండి సంజరుకు తొలిసారిగా సహాయ మంత్రిగా మోడీ క్యాబినెట్‌లో చోటు దక్కింది.
హాజరైన అతిధులు
ప్రధాని నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పొరుగు దేశాలకు చెందిన అధ్యక్షులతో పాటు, దాదాపు 8 వేల మంది హాజరయ్యారు. శ్రీలంక అధ్యక్షుడు రణిల్‌ విక్రమ్‌ సింఘే, మాల్దీవుల అధ్యక్షులు మొహమ్మద్‌ ముయిజ్జు, సీషెల్స్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అహ్మద్‌ అఫీఫ్‌, బంగ్లాదేశ్‌ ప్రధాన మంత్రి షేక్‌ హసీనా, మారిషస్‌ ప్రధాన మంత్రి ప్రవింద్‌ కుమార్‌ జుగ్నాథ్‌, నేపాల్‌ ప్రధాన మంత్రి పుష్ప కమల్‌ దహల్‌ ప్రచండ, భూటాన్‌ ప్రధాన మంత్రి షెరింగ్‌ టోబ్గే లు హాజరయ్యారు. కాంగ్రెస్‌ పార్టీ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే, మిత్రపక్షాల నుంచి చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌, నితీష్‌ కుమార్‌, ఇతర పార్టీ నేతలు పాల్గొన్నారు. అలాగే సినీ ప్రముఖులు రజినీ కాంత్‌, అక్షరు కుమార్‌, షారుఖ్‌ ఖాన్‌, వ్యాపార దిగ్గజాలు గౌతం అదానీ, ముకేశ్‌ అంబానీతో పాటు పలువురు హాజరయ్యారు.
మంత్రివర్గం నుంచి వీరు అవుట్‌
ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ నుంచి ఎన్నికల్లో ఓడిపోయిన స్మృతి ఇరానీతో పాటు, మాజీ కేంద్ర మంత్రులు అనురాగ్‌ ఠాకూర్‌, పురుషోత్తమ్‌ రూపాలా, రాజీవ్‌ చంద్రశేఖర్‌, నారాయణ్‌ రాణే, భారతీ పవార్‌, రావుసాహెబ్‌ దాన్వేలకు మంత్రి పదవులు దక్కలేదు.
సహాయ మంత్రి పదవిని తిరస్కరించిన ఎన్‌సీపీి
సహాయ మంత్రి పదవిని ఎన్‌సీపీ (అజిత్‌ పవార్‌) తిరస్కరించింది. క్యాబినెట్‌ ర్యాంక్‌ కావాలని ఎన్సీపీ డిమాండ్‌ చేస్తోంది. ఎన్‌డీఏ ప్రభుత్వంలో స్వతంత్ర బాధ్యత కలిగిన కేంద్ర సహాయ మంత్రిగా ప్రఫుల్‌ పటేల్‌కు స్థానం కల్పిస్తామన్న బీజేపీ ప్రతిపాదనను ఎన్‌సీపీ తిరస్కరించింది. బీజేపీ మిత్రపక్షమైన ఎన్‌సీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పటేల్‌ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంలో క్యాబినెట్‌ మంత్రిగా పనిచేసినందున, స్వతంత్ర బాధ్యత కలిగిన సహాయ మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించడం తమకు ఇష్టం లేదని స్పష్టం చేసింది. ”మేము మా వైఖరిని బీజేపీ నాయకత్వానికి తెలియజేసాం. వారి స్పందన కోసం కొన్ని రోజులు వేచి ఉంటాం” అని ప్రఫుల్‌ పటేల్‌ అన్నారు.

Spread the love