కొత్త ట్రెండ్‌ సెట్‌ చేసింది

కొత్త ట్రెండ్‌ సెట్‌ చేసిందిఅంతరిక్ష పరిశోధనలు, విజ్ఞాన శాస్త్రంలో ఇటీవలి కాలంలో ప్రతిధ్వనించిన ఒక పేరు డా.అక్షతా కష్ణమూర్తి. భారతీయ సంతతికి చెందిన ఈ శాస్త్రవేత్త మార్స్‌ రోవర్‌కు నాయకత్వం వహించిన మొదటి భారతీయురాలిగా చరిత్రలో ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఔత్సాహిక అంతరిక్ష అన్వేషకులకు స్ఫూర్తిదాయంగా నిలిచిన ఆమె పరిచయం నేటి మానవిలో…
డాక్టర్‌. అక్షతా కష్ణమూర్తి భారతదేశంలో జన్మించిన అంతరిక్ష శాస్త్రవేత్త, ఆమె మార్స్‌ రోవర్‌కు నాయకత్వం వహించిన మొదటి భారతీయురాలిగా గుర్తింపు పొందింది. ఆమె పని అంతరిక్ష పరిశోధనలకు గణనీయంగా దోహదపడింది. ప్రపంచవ్యాప్తంగా ఔత్సాహిక అంతరిక్ష నిపుణులకు ప్రేరణగా పనిచేస్తుంది. అక్షత 2012లో ఏరోస్పేస్‌, ఏరోనాటికల్‌ అండ్‌ ఆస్ట్రోనాటికల్‌ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎం.ఎస్‌ పూర్తి చేసింది. తర్వాత కొంతకాలం ఉద్యోగం చేసింది. ఏరోనాటిక్స్‌ అండ్‌ ఆస్ట్రోనాటిక్స్‌లో డాక్టర్‌ ఆఫ్‌ ఫిలాసఫీని పూర్తి చేయడానికి మళ్లీ మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో చేరింది. తర్వాత ఎంఐటీలో బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌, వెంచర్‌ క్రియేషన్‌ అండ్‌ ఇన్నోవేషన్‌ కోర్సులో చేరింది.
నాసాలో ప్రవేశం
ఏడాది పాటు అర్బానా ఛాంపెయిన్‌లోని ఇల్లినాయిస్‌ విశ్వవిద్యాలయంలో రీసెర్చ్‌ అసోసియేట్‌గా చేసింది. తర్వాత ఎంఐటీకి రీసెర్చ్‌ ఇంటర్న్‌గా మారింది. ఏడాది తర్వాత ప్రాజెక్ట్‌ మేనేజర్‌గా పదోన్నతి పొందింది. ఆరేండ్ల పాటు అక్కడే పని చేసింది. పిహెచ్‌డి పూర్తి చేసిన తర్వాత నాసాలో చేరింది. ప్రస్తుతం ఇస్రో-నాసా వారి చీ×ూA= ప్రాజెక్ట్‌లో పని చేస్తోంది. అక్షత ప్రిన్సిపల్‌ ఇన్వెస్టిగేటర్‌ అండ్‌ మిషన్‌ సైన్స్‌ ఫేజ్‌ లీడ్‌ మిషన్‌లో అంగారక గ్రహ రాతి నమూనాలను అధ్యయనం చేస్తుంది. ఈ ప్రాజెక్ట్‌ ప్రధాన ఉద్దేశం భూమి పర్యావరణ వ్యవస్థలో మార్పులు, వాటి వెనుక కారణాన్ని కనుగొనడం.
ఆశయ సాధన కోసం
యునైటెడ్‌ స్టేట్స్‌లో వలస వచ్చిన విద్యార్థిగా అనేక సమస్యలు ఎదుర్కొంది. అయినప్పటికి తన ఆశయ సాధన కోసం ఎంతో కష్టపడింది. చదువు కోసం ఆమె పడ్డ కష్టం ఆమెను మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (వీ×ు)కి వెళ్లేలా చేసింది. అలాగే పీహెచ్‌డీ కూడా సంపాదించి. నాసాలో ఆమె సాధించిన విజయాలకు ఎంఐటీ వేదికగా నిలిచింది. నాసాలో ఆమె చేసిన విశేషమైన కషి కేవలం మార్స్‌ పర్‌స్వెరెన్స్‌ రోవర్‌కే పరిమితం కాలేదు. ఈ ప్రాజెక్ట్‌ భూమి కోసం మార్టిన్‌ నమూనాలను సేకరించడానికి కేటాయించబడింది. తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఎన్నో విషయాలను పంచుకుంది. అంతరిక్ష శాస్త్రవేత్త జీవితంలోని సంగ్రహావలోకనంపై ఆసక్తిగా ఉన్న వారికి అనేక విషయాలు చెప్పింది. నిమగం చేస్తుంది.
యువ రచయిత కూడా…
నాసా హానర్‌ గ్రూప్‌ అచీవ్‌మెంట్‌ అవార్డ్‌ నుండి ఎమర్జింగ్‌ స్పేస్‌ లీడర్‌ అవార్డు, లుయిగి జి. నాపోలిటానో అవార్డు వరకు ఆమె అద్భుతమైన ప్రశంసలు అందుకుంది. ‘యువర్‌ అల్టిమేట్‌ గైడ్‌ టు ఎ స్పేస్‌ కెరీర్‌’ పేరుతో ఆమె రాసిన ఇ-బుక్‌ విడుదలతో ఆమె మరింత ప్రాచుర్యం పొందింది. శాస్త్ర వేత్తగానే కాక యువ రచయితగా గుర్తింపు పొందింది. అంతరిక్ష రంగంలో ఆమె చేస్తున్న కృషి ఇప్పుడు అనేక మంది యువకులను, ముఖ్యంగా మహిళలు, బాలికలకు స్ఫూర్తిదాయకంగా ఉంది.
అనుభవాలను పంచుకుంటూ…
అక్షత మార్స్‌ పర్సెవెరెన్స్‌ రోవర్‌ ప్రాజెక్ట్‌కు ఎంతో సహకారం అందించారు. ఆమె ఎంతో పట్టుదులతో ఈ ప్రాజెక్ట్‌లో పనిచేశారు. ఇది విశ్లేషణ కోసం భూమికి తిరిగి తీసుకురావడానికి మార్టిన్‌ నమూనాలను సేకరించడంపై దష్టి సారించింది. ఈమె తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా ద్వారా ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది. అందులో ఓ అంతరిక్ష శాస్త్రవేత్తగా తన జీవితంలో ఎదురైన అనేక అనుభవాలను పంచుకుంటుంది. అంతరిక్ష పరిశోధనలో మరింత కృషి చేయడం, మరెన్నో విషయాలను తెలుసుకోవడం ఆమె లక్ష్యం.

Spread the love