– శంకర్పల్లి డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ ఏ. నాగరాజు
నవతెలంగాణ-శంకర్పల్లి
మద్యం అక్రమంగా విక్రయిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసినట్టు శంకర్పల్లి డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ ఏ. నాగరాజు తెలిపారు. మంగళవారం ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ శంక ర్పల్లి మండలంలోని లక్ష్మారెడ్డి కూడా గ్రామానికి చెందిన గౌండ్ల గోపాల్గౌడ్ మద్యం అక్రమంగా అమ్ముతున్నాడనీ పక్కా సమాచారం తెలుసుకుని, తన సిబ్బందితో కలిసి గ్రామానికి వెళ్లి తనిఖీ చేశారు. అతని వద్ద నుంచి రూ.5 వేలకు పైగా 30 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.