ప్రభుత్వ పాఠశాలల సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్ కు వినతి పత్రం అందజేత

నవతెలంగాణ – ఆర్మూర్
ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు సకాలంలో పాఠ్యపుస్తకాలు యూనిఫాంలో అందించి ప్రభుత్వ పాఠశాల సమస్యలను పరిష్కరించాల నీ తెలంగాణ విద్యార్థి పరిషత్ జిల్లా అధ్యక్షుడు బొబ్బిలి కళ్యాణ్ జిల్లా నగర అధ్యక్షుడు అఖిల్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుకు గురువారం వినతిపత్రం అందజేసినారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కలిసి ప్రభుత్వ పాఠశాల లో చదువుతున్న విద్యార్థులకు సకాలంలో పాఠ్యపుస్తకాలు యూనిఫాంలో అందించి ప్రభుత్వ పాఠశాలలో ఉన్న సమస్యలు (పైరేకులు ఊడిపోవడం కిటికీలు విరిగిపోవడం బెంచీలు సరిగ్గా లేకపోవడం ఫ్యాన్లు బ్లాక్ బోర్లు లేకపోవడం) వంటి సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్ ను కోరినారు. దీనికి కలెక్టర్ సానికూలంగా స్పందించి ఈ నెల 28నుండి ప్రభుత్వ ఆదేశాల మేరకు అందిస్తామని తెలిపారు. అదేవిధంగా ప్రైవేట్ విద్యాసంస్థల్లో పుస్తకాలు యూనిఫాంలో అమ్మడాన్ని కలెక్టర్ తెలియజేయడం జరిగింది. కలెక్టర్ సానుకూలంగా స్పందించి డిఈఓ ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. తెలియజేస్తూ ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే స్కూల్ గుర్తింపులు సీజ్ చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు ప్రశాంత్, దేవేందర్, రాహుల్, తదితరులు పాల్గొన్నారు.

Spread the love