ప్లాస్టిక్ రహిత సమాజమే మన ముందున్న లక్ష్యం: కలెక్టర్

– ఎట్టి పరిస్థితుల్లో కార్యాలయంలో ప్లాస్టిక్ వాడొద్దు
– పలు శాఖలలో తనిఖీ చేసిన కలెక్టర్
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
ప్లాస్టిక్ రహిత సమాజమే మన ముందున్న లక్ష్యమని జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావ్ అన్నారు. శనివారం కలెక్టరేట్ లోని  జిల్లా కోశాధికారి కార్యాలయం, డి.పి.ఆర్.ఓ కార్యాలయం, జిల్లా మహిళా,శిశు సంక్షేమ శాఖ కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ  పర్యావరణానికి హాని చేకూర్చే ప్లాస్టిక్ ని వాడొద్దని లేనియెడల జరిమానా విధించడం జరుగుతుందని సూచించారు. ప్రభుత్వ, ప్రవేట్ పాఠశాలలు, వసతి గృహాలు అలాగే అన్ని మున్సిపాలిటీలలో ప్లాస్టిక్ బాటిల్స్, సంచులు, అలాగే ప్లాస్టిక్ కవర్స్ ఎట్టి  పరిస్థితుల్లో కూడా  వినియోగంలో రాకూడదని సూచించారు. అదేవిదంగా ప్లాస్టిక్ నివారణకు  ఆయా శాఖల అధికారులు పటిష్ఠ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జిల్లాలోని అన్ని కార్యాలయాలు ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఆయా శాఖల అధికారులు  కార్యాలయాల్లో ప్లాస్టిక్ బాటిల్స్, ఇతర ప్లాస్టిక్ వస్తువులు వినియోగంలోకి రాకుండా పర్యవేక్షణ చేయాలని  ప్రతి కార్యాలయంలో ఆచరిద్దాం..ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా మానేయడానికి ప్రయత్నించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డి.టి.ఓ శ్రీనివాస్ రావు, డి.పి.ఆర్.ఓ రమేష్ కుమార్, డి డబ్ల్యు ఓ వెంకటరమణ, ఏ.ఓ సుదర్శన్ రెడ్డి  సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Spread the love