ఇ.పట్నం బరిలో ఎర్ర బావుటా

– సీపీఐ(ఎం) ఎమ్మెల్యే అభ్యర్థిగా పి.యాదయ్య
14 నియోజకవర్గాల అభ్యర్థులను ప్రకటించిన రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని
– మూడోసారి బరిలోకి యాదయ్య
– ఎంపీపీ, జడ్పీటీసీ, చైర్మన్‌గా అనుభవం
– పాషా, నరహరి సారథ్యంలో ప్రజా పోరాటాల్లో చురుకైన పాత్ర
సీపీఐ(ఎం) ఒంటరి పోరుకు సిద్ధమైంది. రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేసేందుకు ప్రకటించిన 17 స్థానాల్లో 14 స్థానాలకు అభ్యర్థులను రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రకటించారు. వాటిలో ఇబ్రహీంపట్నం ఒకటి. ఇబ్రహీంపట్నం సీపీఐ(ఎం) ఎమ్మెల్యే అభ్యర్థిగా పి.యాదయ్యను ప్రకటించారు. కమ్యూనిజం అంటే వ్యక్తి కాదు. అంచనాలకు అందని హ్యూమనిజం. ప్రజల కోసం ప్రజలే ఏర్పర్చుకున్న ప్రజల శక్తి. శ్రమ వలన కష్టజీవుల కండ్లల్లో ఏర్పడిన ఎరుపు నుంచి పుట్టిన జెండానే మన ఎర్రజెండా. సరైన సిద్ధాంతాలతో నిక్కచ్చి నిబంధనలతో.. అవినీతితో నిరంతరం పోరాడుతూ.. ప్రజల తరుపున నిలిచిందే ఈ జెండా. స్వ ప్రయోజనాలే అజెండాలుగా.. ఆధిపత్యం కోసం ఆరాట పడుతూ.. పార్టీలన్నీ ఎదుగుతుంటే.. ఓట్ల కోసం, నోట్ల కోసం కాకుండా ప్రజల కష్టాలను, బాధలను తమ భూజాన మోస్తూ.. ప్రజల శ్రేయస్సే ప్రధాన ఎజెండాగా ముందుకు పోతుంది సీపీఐ(ఎం). ఆ పోరాట శక్తే అభ్యర్థిగా పి.యాదయ్యను ప్రకటించింది. ఆయనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు సీపీఐ(ఎం) విజ్ఞప్తి చేస్తుంది.
నవతెలంగాణ-రంగారెడ్డిప్రతినిధి
మంచాల మండలం చెన్నారెడ్డిగూడ గ్రామంలో మధ్య తరగతి రైతు కుటుంబంలో యాదయ్య జన్మించారు. పగడాల వెంకటమ్మ- రాములు తల్లిదండ్రులు. యాదయ్య తన స్వగ్రామంలో ప్రాథమిక విద్య, ఆరుట్లలో హైస్కూల్‌ విద్య, ఇబ్రహీంపట్నం ఇంటర్మీడియట్‌, నగరంలోని కోఠి ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ చేశారు. అనంతరం విద్యావంతుడైన యాదయ్య తెలంగాణ సాయుధ పోరాట యోధులు కృష్ణమూర్తి, పోచమోని జంగయ్య, శ్రీరాం వెంకటయ్య, అడివయ్య, జిల్లా నాయకులు పి.జంగారెడ్డి సారథ్యంలో ఉద్యమంలోకి వచ్చారు.
వారి నాయకత్వంలోనే ఉద్యమ ఓనమాలు దిద్దారు.

రాజకీయ నేపథ్యం :
పగడాల యాదయ్య 1987లో డీవైఎఫ్‌ఐలో పని చేశారు. డీవైఎఫ్‌ఐ మండల కార్యదర్శిగా, జిల్లా ఉపాధ్యక్షునిగా బాధ్యతలు నిర్వహించారు. 1990లో వ్యకాస బాధ్యతలు చేపట్టారు. 1992- 1995 వరకు అరుట్ల పీఏసీఎస్‌ ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఆ బాధ్యతలు చూస్తూనే 1993లో రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యునిగా ఎన్నిక య్యారు. ప్రజా ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొంటుం డడంతో ఆరుట్ల గ్రామ పంచాయతీ కింద ఉన్న చెన్నారెడ్డిగూడ, బండలేమూర్‌ నుంచి యువకుల కు అవకాశం కల్పించాలని పార్టీ విస్తరణలో భాగంగా చురుకైన పాత్ర పోషిస్తున్న క్రమంలో డీవైఎఫ్‌ఐ బాధ్యతలు చూస్తున్న యాదయ్య 1989లో సీపీఐ(ఎం) నేతలు పాషా, నరహరి హత్య సందర్భంగా పార్టీని రక్షించుకునేందుకు, కార్యకర్తల్లో ఆత్మస్తైర్యం నింపడంలో రాష్ట్ర నాయకు లు మధు, జిల్లా నాయకులు పి.జంగారెడ్డి తరువా త యాదయ్య ప్రముఖ భూమిక పోషించారు. అనంతరం 1995లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆరుట్ల ఎంపీటీసీగా ఎన్నికై 2000 వరకు మంచాల ఎంపీపీగా పని చేశారు. 2001-2006 వరకు మంచాల జడ్పీటీసీగా పని చేశారు. ప్రజాప్రతినిధిగా ఉన్నతాధికారులతో చనువుగా మెలగడం, ప్రభుత్వం నుంచి విరివిగా నిధులు తీసుకువచ్చి మండలాన్ని అభివృద్ధి పథంలో నడిపించారు. ఆ బాధ్యతల్లో ఉంటూనే పార్టీలో విచ్ఛిన్నకర శక్తుల వల్ల ఉద్యమానికి తీవ్ర నష్టం కలిగించిన సందర్భంగా సీపీఐ(ఎం) మండల కన్వీనర్‌ బాధ్యతలు చూశారు. నాటి నుంచి జిల్లా కమిటీ సభ్యునిగా, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడిగా పని చేస్తున్నారు. ఇటు వృత్తిదారుల సంఘం జిల్లా గౌరవాధ్యక్షులుగా కొనసాగారు.
సాయుధ పోరాట బావజాలానికి ఆకర్షితులై ఉద్యమంలోకి వచ్చిన తరువాత అంచలంచెలుగా ఎ దుగుతూ పార్టీలకతీతంగా మంచి పేరు గడించారు. ఈ కాలంలో భూపోరాటాలు ఉధృతంగా జరిగాయి. అనేక భూపోరాటాల్లో పని చేశారు. ఎంపీపీగా, జడ్పీటీసీగా ఉంటూ కూలీ రెట్లపెంపు, పాలధరల పెంపు కోసం ఉద్యమాలు నిర్వహించారు. 1992లో రాచకొండలో ఏర్పాటు చేయాలనుకున్న ఫీల్డ్‌ ఫైరింగ్‌రేంజ్‌కు వ్యతిరేకంగా ఉద్యమాలు నిర్వహించా రు. నాటి జిల్లా కలెక్టర్‌ సతీష్‌చంద్రను ఒప్పించి మండల వ్యాప్తంగా వేస్ట్‌ల్యాండ్‌ డెవలప్‌మెంట్‌ పథకాన్ని తీసుకువచ్చారు. సుమారు రూ.60కోట్ల మేర నిధులు రాబట్టారు. భూగర్భజలాల పెంపుకో సం చెక్‌డ్యాంలు, ఊటకుంటలు, పర్క్యూలేషన్‌ ట్యాం కులు, వాలు కట్టలు నిర్మాణం విరివిగా చేపట్టారు. వనరంగ తోటల పెంపకం చేపట్టి ఐఎఎస్‌ అధికారు లతో ప్రశంసలందుకున్నారు. ఎస్సీ, ఎస్టీ రైతులకు చెందిన ప్రభుత్వ బంజారు, సీలింగ్‌భూముల అభివృద్ధి కోసం 400బావుల తవ్వించారు. అప్పటి వరకున్న మట్టిరోడ్లను బీటీ రోడ్లుగా, రోడ్లే లేని గ్రామాలకు మట్టిరోడ్లుగా, లింకురోడ్ల అభివృద్ధికి కృషి చేశారు. నేడు ఆ రోడ్లనే మరమ్మతులు చేసేందుకు కూడా ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకుండా పోయింది. ఎంపీపీగా ఉన్న తరుణంలోనే జిల్లాలో డ్వాక్రా గ్రూపుల ఏర్పాటులోనే మంచాల మండలాన్ని పతాక శీర్షికలో నిలిపిన ఘనత సీపీఐ(ఎం)దే.
2005లో కృష్ణా తాగునీటి కోసం జరిగిన చలో హైదరబాద్‌ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందు కు క్యాడర్‌ను సమీకరించడంలో నాయకత్వంతో పాటు కృషి చేసి విజయం సాధించారు. 130 ప్రభుత్వ శాఖలపై పట్టున్న యాదయ్య సీపీఐ(ఎం) పార్టీ ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు. నియోజకవర్గం సమగ్రాభివృద్ధి జర గాల్సిన అవసరముంది. ఈ ప్రాంతంలోని చెరువులు, కుంటలు నింపాలి. విద్యాకేంద్రంగా ఉన్న ఇబ్రహీం పట్నంలో పీజీ కళాశాల ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరముంది. సైన్స్‌రంగంగా అభివృద్ధి జరగాలి. ప్రతీ ఎస్సీ, ఎస్టీ కుటుంబానికి రూ.20లక్షల రుణాలు షరతులు లేకుండా అందజేయాలి. పాలిటెక్నిక్‌ కళాశాల స్థాపన జరగాలి. డిగ్రీ కళాశాల నిర్మాణం పూర్తి చేసుకోవాలి. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే పరిశ్రమల స్థాపన జరగాలి. మహిళలకు స్వయం ఉత్పత్తుల ప్రోత్సాహం కల్పిం చాలి. ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా విద్యా ర్థులు, యువత, మహిళలు, కార్మికులు, కర్షకులు, వ్యవసాయ కార్మికులు సంయుక్తంగా ఉద్యమించాలి. ఇందుకు సీపీఐ(ఎం) అభ్యర్థి పి.యాదయ్యను గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Spread the love