పొలాలకు వెళ్ళేందుకు రోడ్డు వేయాలి

– ప్రభుత్వానికి రైతుల వేడుకలు
– సొంత ఖర్చులతో గుంతలను పూడ్చివేత
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని పెద్దతూండ్ల గ్రామపంచాయతీ పరిధిలోని కిషన్ రావుపల్లి రైతులు పొలాల వద్దకు వెళ్లాలంటే  వర్షాకాలం వచ్చిందంటే చాలు ఎడ్లబండ్లు,ట్రాక్టర్లు ఎరువులు,విత్తనాలు వేసుకొని వెళ్ళాలన్న,ద్విచక్రవాహనం, కాలి నడకన వెళ్లాలన్న నరకయాతన అనుభవిస్తున్నామని రైతులు వాపోతున్నారు. ఎన్నోసార్లు ట్రాక్టర్లు గుంతల్లో దిగబడితే జేసిబిల సహాయంతో ట్రాక్టర్లను తీసిన రోజులున్నాయని చెబుతున్నారు. అయితే ఇబ్బందులు చూడలేక ఆ ప్రాంతంలో పొలాలున్న రైతులు కలిసి తలా కొంత డబ్బులు వేసుకొని సొంత ఖర్చులతో రోడ్డుపై భారీగా ఉన్న గుంతలను మూడు కిలోమీటర్ల మేర పూడ్చినట్లుగా తెలిపారు. మెరుగైన రహదారి ఏర్పాటు కావాలంటే ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పట్టించుకోని రోడ్డుపై మట్టి పోయాలని వేడుకొంటున్నారు.
Spread the love