
మండలంలోని కుసుమూర్తి గ్రామ శివారులో వరుసగా వ్యవసాయ విద్యుత్ ట్రాన్స్‌ఫార్మరల దొంగతనాలు జరుగుతున్నాయని ఆ గ్రామ రైతులు భయాందోళన వ్యక్తం చేశారు. శనివారం గ్రామానికి చెందిన కురువ తాయప్ప వ్యవసాయ పొలంలో ఉన్న 25 కేవీ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ను గుర్తుతెలియని దుండగులు శుక్రవారం అర్ధరాత్రి విద్యుత్ లైన్లను బంద్ చేసి ట్రాన్సఫార్మరను విప్పి దాని లోపల ఉన్న విలువైన కాఫర్ వైరును దొంగలించారని, ట్రాన్స్‌పార్మర్ వస్తువులు ఆయిల్‌తోపాటు కాపర్ వైర్ చోరీ చేసారని ఆయన పేర్కొన్నారు. దుండగులు గత నెలలో ఇదే గ్రామ శివారులో విద్యుత్ ట్రాన్స్‌పార్మర్‌లలో కాఫర్ వైరును ఎత్తుకెళ్లగా అదెశివారులో వరుసగా రెండోసారి కూడా మళ్లీ విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌లలో కాఫర్ వైరును ఎత్తుకెళ్లాడాంతో ఆ గ్రామ రైతులు భయాందోళనకు గురవుతున్నారని తెలిపారు, దాని విలువ సుమారు రూ.2లక్షలు ఉంటుందన్నారు. దీంతో పంట పొలాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయి వరి మడ్లకు నీరందక ఎండిపోయే ప్రమాదం ఉందని, ట్రాన్స్ఫారం దొంగిలై నష్టపోవడమే గాక, వరి మడులకు నీరందక ఎండిపోయి చాలా నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని రైతు ఆవేదన చెందారు, విద్యుత్ అధికారులు నష్టపోయిన రైతును ఆదుకోవాలని, ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని ఆ రైతు పేర్కొన్నారు.