సైబర్ నేరగాళ్లతో జాగ్రత్త..!

నవతెలంగాణ – రేవల్లి
రేవల్లి మండలం బండ రాయిపకుల గ్రామానికి చెందిన కర్తల బంగారయ్యకి గడిచిన నెల మే 11 తారీఖున,  ఒక అపరిచిత వ్యక్తి ఫోన్ చేసి. ఎస్బిఐ క్రెడిట్ కార్డు నుంచి ఫోన్ చేశామని, మీరు ఎనీ డిస్క్ యాప్ నీ డౌన్లోడ్ చేసుకోమని చెప్పగా,  బంగారయ్య ఎందుకు అని అడుగగా, మీరు ఇంతకు ముందుకు క్రెడిట్ కార్డులో అమౌంట్ తీసుకున్నారు కదా! దానికి సంబంధించిన ఇంట్రెస్ట్ తగ్గడానికి ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అని చెప్పారు. బంగారయ్య వెంటనే యాప్ డౌన్లోడ్ చేసుకుని యాప్ పర్మిషన్ కు ఆధార్ కార్డు బ్యాంక్ డీటెయిల్స్ అడిగిన దానికి ఓటిపి తదితర వివరాలతో  సహా చెప్పగా, సైబర్ నేరగాడు ఒకసారి ఫోన్ పే ఓపెన్ చేసి చూడు అన్నప్పుడు, తను ఫోన్ పే ఓపెన్ చేసి చూస్తే అమౌంటు ఉంటాయి, అప్పటివరకు ఫోన్ మాట్లాడుతున్న అపరిచిత వ్యక్తి ఫోన్ కట్ చేసిన తర్వాత వెంటనే, బంగారయ్యకు అమౌంట్ కట్ అయినట్టు మెసేజ్ వచ్చింది. డౌటు వచ్చి ఫోన్ పే చూస్తే, అకౌంట్లో 37,072 రూపాయలు కట్ అయినట్టు చూపించింది. వెంటనే కంప్లైంట్ నెంబర్ 1930 కి ఫోన్ చేసి కంప్లైంట్ చేశాడు. మంగళవారం రేవల్లి మండల పోలీస్  స్టేషన్ లో ఫిర్యాదు చేయగా, ఎస్ఐ శివకుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామన్నారు.
Spread the love