జాతీయ బీసీ కమిషన్ ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయ సేకరణ

నవతెలంగాణ- నవీపేట్: జాతీయ బీసీ కమిషన్ ఆధ్వర్యంలో మహారాష్ట్ర సదన్ లో తెలంగాణ ప్రభుత్వం సిఫారసు చేసిన 40 బీసీ కులాలపై జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ హంసరాజు గంగారం అహీర్ ఆధ్వర్యంలో మంగళవారం ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా 17 కొత్త కులాల ప్రతినిధులతో పాటు 23 పాత కులాల ప్రతినిధులు హాజరయ్యారు. బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్, రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య, పార్లమెంట్ సభ్యులు బీబీ పాటిల్ మరియు మరియు బీసీ కమిషన్ సభ్యులు  శుభప్రద పటేల్ హాజరయ్యారు. బిసి కులాల సంక్షేమానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రతినిధులు మోహన్ చవాన్, జాదవ్ శరత్, రాంప్రసాద్, గంగా ప్రసాద్, ప్రవీణ్, ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love