నవతెలంగాణ – హైదరాబాద్: గత రెండు రోజులుగా హైదరాబాద్‌తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. దీంతో ప్రాజెక్టులకు వరద పోటెత్తింది. నల్లగొండ జిల్లా కేతేపల్లి మండల పరిధిలోని మూసీ ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరుగుతోంది. దీంతో ప్రాజెక్టు 5 గేట్లను ఒక్కో అడుగు మేర ఎత్తి 3250 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. హైదరాబాద్ జంట జలాశయాలైన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ప్రాజెక్టులకు కూడా వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. ఈ క్రమంలో హిమాయత్ సాగర్ ప్రాజెక్టు 4 గేట్లు, ఉస్మాన్ సాగర్ 2 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. దీంతో మూసీకి వరద పోటెత్తింది. మూసీ పరివాహక ప్రాంత ప్రజలను కూడా అధికారులు అప్రమత్తం చేశారు.