నవతెలంగాణ- హైదరాబాద్: మాది సన్యాసుల మఠం కాదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. మాకు సీట్లు కావాలని డిమాండ్ చేశారు. కలిసి వస్తేనే కాంగ్రెస్ తో కలిసి పోటీ చేస్తామన్నారు. లేదంటే తామకు బలం ఉన్న 20 స్థానాలు, సీపీఐ(ఎం)కి బలం ఉన్న కొన్ని స్థానాలలో పోటీ చేస్తామన్నారు. జాతీయస్థాయిలో పొత్తులు వేరు రాష్ట్రస్థాయిలో పొత్తులు వేరు అని అన్నారు. రాష్ట్ర ఇన్చార్జిగా నేను ఫెయిల్ అయ్యానా కాదా అనేది చర్చ కాదు. ఇక కాంగ్రెస్ తో చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. ఇండియా కూటమి దెబ్బకి జమిలి ఎన్నికలు అని మోడీ మొదలుపెట్టాడని విమర్శించారు. మోడీ ఆర్ఎస్ఎస్ రాజ్యాంగనే మార్చలేడు భారత రాజ్యాంగం మార్చుతాడా అని ఎద్దేవా చేశారు. జమిలీ ఎన్నికల కోసం వేసిన కమిటీ బోగస్ అన్నారు. ఆ కమిటీ కనీసం అఖిలపక్షంతో మాట్లాడలేదన్నారు.