భారత్‌కు తిరిగొచ్చిన స్టార్ పేసర్..

నవతెలంగాణ – హైదరాబాద్: టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా భారత్‌కు తిరిగొచ్చేశాడు. అదేంటి ఓ పక్క ఆసియా కప్ జరుగుతుంటే బుమ్రా.. ఆడకపోవడం ఏంటి అనుకుంటున్నారా? కానీ ఇది నిజం. వ్యక్తిగత కారణాలతో బుమ్రా.. తన స్వస్థలం ముంబయికి వచ్చేసినట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. దీంతో సోమవారం నేపాల్‌తో జరగనున్న మ్యాచుకు బుమ్రా దూరం కానున్నాడు. అయితే కొన్ని రోజులు మాత్రమే బుమ్రా ముంబయిలో ఉంటాడని.. ఆసియా కప్ గ్రూప్-4 ప్రారంభ మ్యాచ్‌ల నాటికి తిరిగి జట్టులో చేరతాడని సదరు వర్గాలు పేర్కొన్నాయి.బుమ్రా భార్య సంజనా గణేశన్  ప్రస్తుతం గర్భవతి. త్వరలోనే ఆమె ప్రసవించనుందని తెలుస్తోంది. అందుకే బుమ్రా భారత్ తిరిగొచ్చాడని తెలుస్తోంది. అయితే బుమ్రా వ్యక్తిగత కారణాలతో ముంబై తిరిగొచ్చాడని తొలుత ప్రచారం జరిగింది. కీలక తరుణంలో భార్య చెంతన ఉండటమే కోసమే బుమ్రా వచ్చాడని క్లారిటీ వచ్చింది.

Spread the love