దివ్యాంగులకు మరింత ఆసరా ..

– స్థలం ఉంటే ఇల్లు మంజూరు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి 
నవతెలంగాణ -నసురుల్లాబాద్ 
రాష్ట్ర ప్రభుత్వం.. దివ్యాంగులకు ఆసరా పింఛన్‌ పెంచి ఆదుకుంటోందని రాష్ట్ర శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు మంగళవారం నసురుల్లా బాద్ మండల కేంద్రంలోని రాంమందిర్ కమ్యునిటీ హాల్ లో మండల పరిధిలోని అన్ని గ్రామాల 513మంది దివ్యాంగులకు పెరిగిన ఫించన్ ప్రొసీడింగ్స్ పత్రాలను, అదే విధంగా కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ 30 మంది లబ్ధిదారులకు చెక్కులను  రాష్ట్ర శాసన సభాపతి శ్రీ పోచారం శ్రీనివాస్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమములో ఆదర్శంగా నిలిచిందని. రైతులకు అండగా నిలిచిందన్నారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా డబుల్ బెడ్రూంలో ఆసరా పెన్షన్లు ఉచిత విద్యుత్ రైతుబంధు రైతు భీమా అలాంటి పథకాలు దేశంలోనే ఆదర్శంగా నిలసిందన్నారు. వికలాంగులకు దేశంలో అత్యధికంగా రూ. 4016 అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. దేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ లాగా 28 మంది ముఖ్యమంత్రులు ఉన్నారు. కానీ మన రాష్ట్రంలో లాగా వికలాంగులకు రూ. 4016 ల పెన్షన్ ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వడం లేదన్నారు. ఆంద్రప్రదేశ్ లో రూ. 3,000, అస్సాం రూ.300, బీహార్ రూ.400, చత్తీస్ ఘడ్ రూ.500, గుజరాత్ రూ.600, హర్యానా రూ. 2,250, కర్ణాటక రూ.600, కేరళ రూ. 1,400, మధ్యప్రదేశ్ రూ.600, మహారాష్ట్ర రూ.1000, తమిళనాడు రూ.1000, ఒడిస్సా రూ.500, పంజాబ్ రూ.800, రాజస్తాన్ రూ.750, ఉత్తరప్రదేశ్ రూ.500, పశ్చిమ బెంగాల్ రూ.1000 చొప్పున వికలాంగుల పెన్షన్ ఇస్తున్నారు. ఇతర రాష్ట్రాలలో ఇంత తక్కువ పెన్షన్ ఇస్తున్నా మన దగ్గర కొంతమంది నాయకులు తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు చేస్తారని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మంచితనం, మానవత్వంతో దివ్యాంగులకు అండగా ఉండాలని రూ. 4016 ల పెన్షన్ ఇస్తున్నారు. పెంచమని ఎవ్వరూ అడగకపోయినా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వికలాంగులకు పెన్షన్ పెంచారు. కామారెడ్డి జిల్లాలో మొత్తం 18,693 మంది వికలాంగులకు నెలకు రూ. 7.50 కోట్ల పెన్షన్ ఖర్చు అవుతుందన్నారు. వికలాంగుల పెన్షన్ భారీగా పెరగడంతో మామూలు వ్యక్తులకు కూడా ఆశ భారీగా పెరిగిందన్నారు. కొందరు తమకు కూడా పెన్షన్ ఇప్పించాలని అడుగుతున్నారు. కానీ శారీరకంగా లోపం ఉండి, సదరం సర్టిఫికెట్ కలిగిన వారు మాత్రమే వికలాంగుల పెన్షన్ కు అర్హులు. వికలాంగుల పెన్షన్ మంజూరు చేపిస్తామని ఎవరైనా ఫైరవీకారుల, దళారుల మాటలను నమ్మ వద్దన్నారు.  స్వంత స్థలం కలిగిన వికలాంగులు అందరికీ గృహలక్ష్మి పథకంలో ఇంటిని మంజూరు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు పెరిక శ్రీనివాస్ ఎంపీపీ పాల్త్య విఠల్ , జడ్పిటిసి జన్నుభాయి ప్రతాప్ సింగ్, జిల్లా పరిషత్ కో ఆప్షన్ నెంబర్ మజీద్ , సొసైటీ చైర్మన్లు గంగారం దివిటీ శ్రీనివాస్, మారుతి పటేల్, నాయకులు కంది మల్లేష్, లక్ష్మీనారాయణ గౌడ్, ఖలీల్ మైస గౌడ్, ప్రభాకర్ రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు ఎంపిటిసి సభ్యులు నాయకులు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love