అభ్యాసన సామర్ధ్యాలు పెంచేందుకు ఉపాధ్యాయులకు శిక్షణ 

– జిల్లా విద్యాధికారి కే.శ్రీనివాస్ రెడ్డి
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్ 
కరోనా సమయంలో విద్యార్థులలో అభ్యాసన సామర్ధ్యాలు మందగించాయని , విద్యార్థులలో అభ్యాసన సామర్థ్యాలు పెంచేందుకు ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ తరగతులు ఏర్పాటు చేశామని సిద్దిపేట జిల్లా విద్యాధికారి కే శ్రీనివాసరెడ్డి అన్నారు. మంగళవారం హుస్నాబాద్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థుల్లో గుణాత్మక విద్య, సమన విద్య అందించే లక్ష్యం తో ప్రాథమిక తరగతుల్లో ప్రారంభమైన తొలిమెట్టు విజయవంతం అయిందన్నారు. ఈ విద్యా సంవత్సరం ఉన్నత పాఠశాలల్లో ఉన్నతి కార్యాక్రమాన్ని ప్రారంభించామని అన్నారు. అభ్యసన విషయంలో  జాతీయ సగటు కంటే మనం మరింత తక్కువగా ఉండడం కూడా ఆందోళనకరం అన్నారు. ఈ అంశం వివిధ రంగాల పై ప్రభావం ఏర్పరుస్తుందని, ప్రమాదాన్ని ముందే పసిగట్టిన ప్రభుత్వం 6వ తరగతి నుండి 9 వ తరగతి బోధించే ఉపాధ్యాయులకు ఉన్నతి కార్యక్రమంలో శిక్షణ ఇస్తుందన్నారు. ఈ కార్యక్రమములో మండల విద్యాధికారులు టి.దేశి రెడ్డి , ఎం.నర్సింహా రెడ్డి, కె.పావని, బోధించే రిసోర్స్ పర్సన్ లు, పాఠశాలల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Spread the love