ఒట్టావా: కెనడాలోని మిస్సిస్సౌగలో దారుణం జరిగింది. ఓ గుర్తు తెలియని వ్యక్తి భారత సంతతికి చెందిన సిక్కు మహిళ పవన్ ప్రీత్ కౌర్ (21)ని కాల్చిచంపాడు. సోమవారం సాయంత్రం స్థానికంగా ఉన్న ఓ గ్యాస్ స్టేషన్ వెలుపల ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. తూటా గాయాలతో రక్తపు మడుగులో పడివున్న మహిళను హుటాహుటిన సమీప ఆస్పత్రికి తరలించారు. ఆమెను పరీక్షించిన వైద్యులు అప్పటికే మరణించినట్లు ధృవీకరించారు. కాల్పుల ఘటనకు ముందు నిందితుడు గ్యాస్ స్టేషన్ ముందే తచ్చాడినట్లు పోలీసులు సీసీ ఫుటేజ్‌లో గుర్తించారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చేపట్టారు.