గురువు లేని సమాజం గుడ్డిదే

నవ తెలంగాణ- రామారెడ్డి
సమాజంలో గురువు లేని ఏ విద్య అయినా గుడ్డి దేనని, సమాజంలో గురువుల పాత్ర మొదటి స్థానంలో ఉంటుందని శుక్రవారం ఎంపీపీ దశరథ్ రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని మండలంలోని 23 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు, శాలువాలతో సన్మానించి, ప్రశంస పత్రం తో పాటు జ్ఞాపికను అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ దశరథ్ రెడ్డి, సర్పంచ్ సంజీవ్, ఎంఈఓ యోసేపు, ప్రధాన ఉపాధ్యాయులు రాజులు, బసవరాజ్, ఆయా పాఠశాల ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.
Spread the love