గాడి తప్పిన ప్రత్యేక పాలన..

– పారిశుద్యంపై పట్టింపు కరువు
– కుక్కలు, పందులు స్వైరవిహారం 
– మూడు నెలలుగా కార్మికులకు అందని వేతనాలు
– కార్యదర్శులకు తప్పని కష్టాలు
నవతెలంగాణ – మల్హర్ రావు
మండల పరిధిలోని పదిహేను గ్రామపంచాయతీల్లో ప్రత్యేక పాలన పూర్తిగా గాడితప్పింది.పాలకవర్గం పదవీకాలం ముగియడంతో ప్రభుత్వం పంచాయతీలకు ప్రత్యేక అధికారులను నియమించింది.ప్రత్యేక అధికారులు సమయపాలన పాటించకపోగా గ్రామాలవైపు కన్నెత్తి చూడటం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.ప్రత్యేక పాలనలో ప్రజలు ఇబ్బందులకు గురివుతున్నారు.ప్రధాన రోడ్లపై చెత్తాచెదారం, రోడ్లకు ఇరువైపులా గడ్డి, పిచ్చిమొక్కలు పెరిగిపోయి అపరిశుభ్రంగా దర్సనమిస్తున్నాయి.మురుగు నీరు రోడ్లపై,ఖాళీగా ఉన్న ప్రదేశాల్లో నీరు నిల్వలుగా ఉండటంతో దుర్గంధం వేదజల్లతొంది.మురుగునీటి గుంతలో దోమలు,ఈగలు రాజ్యమేలుతున్నాయి.అంతర్గత రోడ్లు అపరిశుభ్రంగా ఉన్నాయి.పారిశుద్ధ్య పనులు చేయించాల్సిన అధికారులు పట్టించుకోకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.మొత్తంగా పల్లె పాలన పడకేసింది.కుక్కలు,పందులు,కోతులు గుంపులుగా వెళ్లడం, వాటి స్వైరవిహారం పెరిగిపోవడంతో ప్రజలు బయటకు రావాలంటే జంకుతున్నారు.అసలే వానాకాలం కావడంతో సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదం పొంచివుంది.
పడకేసిన పల్లె పాలన..
పల్లె పాలన పడకేసింది.గ్రామపంచాయతీల ఖాతాలు ఖాళీ అయ్యాయి.కనీసం కరెంట్ బిల్లులు,బోర్ మరమ్మతులు,డీజిల్ కొనలేని పరిస్థితి ఏర్పడింది.మల్టిపర్పస్ వర్కర్లకు మూడు నెలలుగా జీతాలు కరువైయ్యాయి.కరెంట్ బిల్లులు భారంగా మారాయి.మురికి కాల్వలు తీయడం,ప్లాస్టిక్ ఎరడం తలనొప్పిగా మారింది.స్పెషల్ ఆపిసర్లు చేతులెత్తేశారు.పంచాయతీ కార్యదర్శులు అప్పులు చేసి కనీస అవసరాలు తీర్చేoదుకు నానా తంటాలు పడుతున్నారు.పెద్ద గ్రామపంచాయతీలకు కొంత నయంగా వెయ్యిలోపు జనాభా ఉన్న పంచాయతీల పరిస్థితి అద్వాన్నంగా మారింది.
పంచాయతీ కార్యదర్శులకు తప్పని కష్టాలు..
పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం,స్టేట్ ఫైనాన్స్ ఇచ్చే నిదులు ముఖ్యమైన ఆర్థిక ఆధారాలు కాగా 2022 ఆగస్టు నుంచి ఎస్ఏప్ సి నిదులు రావడం లేదు.ఇక జనాభా అనుగుణంగా ఒక్కొక్కరి రూ.812 చొప్పున 15వ ఆర్థిక సంఘం నిదులు మంజూరు చేస్తోంది.ప్రత్యేక అధికారులు వచ్చినప్పటి నుంచి అవికూడా రావడం లేదు.ఇక పెద్ద గ్రామపంచాయతీల్లో ఇంటి పన్నులు,తైబజార్, గృహ నిర్మాణ పిజులు,వ్యాపార,వాణిజ్య లైసెన్స్ పిజులు రూపెనా కొంత ఆదాయం సమకూరుతొంది.కానీ చిన్న గ్రామపంచాయతీలకు ప్రభుత్వం ఇచ్చే గ్రాంట్ తప్పా ఎలాంటి ఇతర ఆధారాలు లేవు.ఇక వీరు నెలనెలా ట్రాక్టర్ ఈవిఐ,డీజిల్,బోర్లు రిపేర్, కరెంట్ బిల్లులు,విద్యుత్ బల్బులు,డంపు యార్డుల నిర్వహణ,మల్టి పర్పస్ వర్కర్ల జీతాలు,పారిశుధ్యం,ప్లాస్టిక్ ఏరివేత తాగునీటి సమస్య లాంటి కార్యక్రమాలను నిర్వహించాల్సి ఉంటుంది.అయితే వీటికి వనరులు లేక నానా అవస్థలు పడుతున్నారు.స్పెషల్ ఆపిసర్లు కనీసం పంచాయతీల వైపు తొంగి చూసిన దాఖలాలు లేవు.దీంతో ఒక్కొక్క కార్యదర్శి ఐదు నెలల కాలంలో రూ.10 నుంచి రూ.30 వేల వరకు అప్పులు చేసినట్లుగా సమాచారం.
అస్తవ్యస్తంగా పారిశుధ్యం: అక్కల బాపు యాదవ్., ప్రజా సంఘాల నాయకుడు
ప్రత్యేక అధికారుల పాలనలో పారిశుధ్యం పడకేసింది. గ్రామాల్లో ప్రత్యేక అధికారులు కనిపించడం లేదు.అంతర్గత రోడ్లు అపరిశుభ్రంగా, చెత్త,చెదారం,పిచ్చిమొక్కలు, గడ్డితో నిండిపోయి దుర్గంధం వేదజల్లుతొంది.ఇప్పటికైనా ఉన్నతాధికారులు పట్టించుకోని పారిశుధ్య పనులు చేపట్టాలి.లేదంటే ప్రజలు అనారోగ్యానికి గురైయ్యే ప్రమాదం పొంచివుంది.
Spread the love