ఉరేసుకుని యువకుడు ఆత్మహత్య

నవతెలంగాణ – మాక్లూర్
మండలంలోని మందన్ పల్లి తండకు చెందిన మగావత్ ప్రకాష్ (19) మానసిక స్థితి సరిగ్గా లేక యప చెట్టుకు ఉరివేసుకొని మృతి చెందిన సంఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చినట్లు ఎస్సై సుదీర్ రావు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం మదన్ పల్లి తండాకు చెందిన ప్రకాష్ మానసిక పరిస్థితి సరిగ్గా లేక గత కొన్ని రోజులుగా ఇంటికి రాకపోవడంతో కుటుంబీకులు పరిసరాలలో గాలించారు. గురువారం బైక్ కనిపించిన వ్యక్తి కనిపించకపోవడంతో ఆందోళన చెందారు. శుక్రవారం లక్ష్మన్ గుట్టలో కుళ్లిపోయిన శవం వేప చెట్టుకు ఉరివేసుకొని ఉందని పోలీసులకు తెలుపడంతో పోలీసులు వెళ్లి పరిశీలించారు. శవాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. మృతుని తండ్రి లింబ పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
Spread the love