వర్క్ ఫ్రం హోం ఫ్రాడ్ ద్వారా మోసపోయిన యువతి

నవతెలంగాణ కంఠేశ్వర్ 
ఒకటవ పోలీస్ స్టేషన్ పరిధిలో వర్క్ ఫ్రం హోం ఫ్రాడ్ ద్వారా ఓ యువతి మోసపోయినట్లు ఒకటవ పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ వో రఘుపతి తెలిపారు. ఎస్ హెచ్ ఓ రఘుపతి తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ రామ్ గోపాల్ స్ట్రీట్ కు చెందిన ఫిర్యాదు గౌతమ్ గాంధీ వృత్తి వ్యాపారం తన యొక్క భార్య ఫేస్ బుక్ లో రీల్స్ చూస్తుండగా వర్క్ ఫ్రం అనే యాడ్ చూసి ఆకర్షితులై గుర్తు తెలియని నంబర్ నుండి ఆమె వాట్సప్ కు లింక్ పంపక ఆమె తన యొక్క బ్యాంక్ డీటెయిల్స్ పంపి తర్వాత రిజిస్ట్రేషన్ ఫీ గురించి మొత్తం నగదు 90,300/- ఫోన్ పే ద్వారా గుర్తు తెలియని వ్యక్తికి పంపి మోసపోయినట్లుగా తెలుసుకొని పోలీస్ స్టేషన్లో దరఖాస్తు ఇచ్చారు. ఈ విషయంలో సంబంధిత పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Spread the love