మాదిగల చిరకాల కోరిక ఏబిసిడి వర్గీకరణ..

Our eternal desire is ABCD classification..నవతెలంగాణ – భువనగిరి
మాదిగల చిరకాల కోరిక ఏబిసిడి వర్గీకరణ కోసం రాష్ట్ర అసెంబ్లీలో బిల్లులు చట్టబద్ధత కల్పించినందుకు ప్రభుత్వానికి ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో కృతజ్ఞతలు తెలిపారు. మంగళవారం స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ 30 సంవత్సరాల అలుపెరుగని పోరాటంలో అమరులైన త్యాగ ఫలితమే ఈనాటి ఏబిసిడి వర్గీకరణ అని పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తను ఇచ్చిన మాట ప్రకారం వర్గీకరణ కట్టుబడి ఉండడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కూరెళ్ళ రమేష్ మాదిగ, రుషి మహేష్ బహిరపాక నాగరాజు బోట్ల శ్రీనివాస్,  సంఘ స్వామి,  కొంపల్లి వెంకట్,  వెల్మజాల యాదయ్య,  బైరపాక సురేష్  పాల్గొన్నారు.
Spread the love