Monday, August 24, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుసీపీఎస్‌‌ను రద్దు చేయండి

సీపీఎస్‌‌ను రద్దు చేయండి

- Advertisement -

ఓపీఎస్‌‌ను పనరుద్ధరిస్తే మళ్లీ గెలిపించుకుంటాం
నవంబర్‌ 17న రాష్ట్రవ్యాప్తంగా సామూహిక సెలవు
‘జనజాగరణ’లో టీఎస్‌‌సీపీఎస్‌ఈయూ అధ్యక్షుడు స్థితప్రజ్ఞ
జోరు వానలోనూ కొనసాగిన ‌సభ
సడలని సీపీఎస్‌ ఉద్యోగుల సంకల్పం

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
‘సీఎం రేవంత్‌‌రెడ్డి సారూ కాంగ్రెస్‌ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం సీపీఎస్‌ ‌విధానాన్ని రద్దు చేయండి. ఓపీఎస్‌‌ను పునరుద్ధరించండి. టీపీసీసీ అధ్యక్షులుగా మీరిచ్చిన హామీని నమ్మి గత ఎన్నికల్లో కాంగ్రెస్‌‌ను గెలిపించుకున్నాం. సీపీఎస్‌‌ను రద్దు చేస్తే కాంగ్రెస్‌‌ను మళ్లీ గెలిపించుకుంటాం. ’అని టీఎస్‌‌సీపీఎస్‌ఈయూ రాష్ట్ర అధ్యక్షుడు గంగా పురం స్థితప్రజ్ఞ అన్నారు. ఓపీఎస్‌ ‌సాధన కోసం ఆదివారం టీఎస్‌‌సీపీఎ స్‌ఈయూ ఆధ్వర్యంలో జనజాగరణ యాత్ర ముగింపు సభను హైదరా బాద్‌‌లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించారు. హోరు వర్షంలో నూ బహిరంగ సభ కొనసాగింది. కుటుంబ సభ్యులు, పిల్లలతో సీపీఎస్‌ ఉద్యోగులు వేలాదిగా హాజరై ఐక్యతను చాటారు. వర్షం వచ్చినా సీపీఎస్‌‌ను రద్దు చేయాలన్న వారి సంకల్పం సడలలేదు. సభ పూర్తయ్యే వరకు ఉండి విజయవంతం చేశారు. మహిళా ఉద్యోగులు, అంధులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. సీపీఎస్ ఉద్యోగులకు మద్దతుగా ఓపీఎస్‌ ఉద్యోగులు కూడా పాల్గొని సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా స్థితప్రజ్ఞ మాట్లాడుతూ ఓపీఎస్‌ ‌సాధన కోసం నవంబర్ 17న రాష్ట్రవ్యాప్తంగా సామూహిక సెలవు దినంగా పాటించాలని పిలుపునిచ్చారు. అదేరోజు జిల్లా కేంద్రాల్లో సత్యాగ్రహ దీక్షలు చేపట్టాలని కోరారు.

22 ఏండ్లు సీపీఎస్ ఉద్యోగ, ఉపాధ్యాయులకు సామాజిక భద్రత కరువై ఎన్నో వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఇప్పటికే 5000కు పైగా రిటైర్మెంట్లు జరిగాయని వివరించారు. కానీ ఏ ఒక్కరికీ కూడా కనీసం రూ.5 వేల పెన్షన్ కూడా అందడం లేదన్నారు. ఎక్కడో యుద్దం జరిగితే తెలంగాణలో ఉన్న సీపీఎస్ ఉద్యోగి ప్రాన్ అకౌంట్‌లో సొమ్ము ఆవిరి అ‌య్యిందని చెప్పారు. ఉద్యోగుల సొమ్మే కాకుండా ప్రభుత్వం సొమ్ము కూడా మార్చిలో రూ. 1,800 కోట్లు ఆవిరి అయ్యాయన్నారు. పాత పెన్షన్ విధానంలో ఉన్న మాదిరిగా కనీస పెన్షన్ హామీ లేకపోవడం దురదృష్టకరమని అన్నారు. 12 ఏండ్లుగా చేసిన పోరాటాల వల్లే సీపీఎస్ ఉద్యోగులకు డెత్ కమ్ రిటైర్మెంట్ గ్రాడ్యుటీ సాధించుకున్నామని చెప్పారు. ఉద్యమ ఫలితంగా జీవో నెంబర్‌ 58 ద్వారా ‌కుటుంబ పెన్షన్ సాధించుకున్నామని వివరించారు.

​అదే తరహాలో తెలంగాణలోనూ పునరుద్ధరించాలి
కాంగ్రెస్, మిత్రపక్షాలు పాలిస్తున్న రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్‌, హిమాచల్ ప్రదేశ్ లలో పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించిన విధంగానే తెలంగాణలోనూ అమలు చేయాలని స్థితప్రజ్ఞ కోరారు. కాంగ్రెస్ మ్యానిఫెస్టో డే అయిన నవంబర్ 17 నాటికి ప్రభుత్వం స్పందించి సీపీఎస్ రద్దుపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని డిమాండ్‌‌ చేశారు. ఒకవేళ స్పందించని పక్షంలో అదేరోజు రాష్ట్రవ్యాప్తంగా సీపీఎస్ ఉద్యోగ, ఉపాధ్యాయులందరూ సామూహిక సెలవులు పెట్టి, జిల్లా కేంద్రాల్లో సత్యాగ్రహ దీక్షలతో ఆవే దనను ప్రభుత్వానికి తెలియజేస్తారని అన్నారు.

​మా ‌భద్రత.. పిల్లల భవిష్యత్‌ ‌
కోసమే : శ్రీకాంత్‌
సీపీఎస్‌ ఉద్యోగుల సామాజిక భద్రత, పిల్లల భవిష్యత్‌ ‌కోసమే ఓపీఎస్‌‌ను పునరుద్ధరిం చాలని టీఎస్‌‌సీపీఎస్‌ఈయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్వల్‌ శ్రీకాంత్ అన్నారు. సీపీఎస్ ఉద్యోగ, ఉపాధ్యాయుల వృద్ధాప్య భవిష్యత్తు అంతా షేర్ మార్కెట్ పాలవుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. జీవితకాలం ప్రభు త్వానికి సేవ చేస్తే, ఆఖరుకు పెన్షన్ నిధులను షేర్ మార్కెట్‌ దయాదాక్షిణ్యాలపై వదిలే యడం ఏమాత్రం న్యాయం కాదన్నారు. షేర్ మార్కెట్ ఆధారిత పెన్షన్ కాదనీ, భరో సానిచ్చే పాత పెన్షన్‌ ‌కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీఎస్‌‌సీపీఎస్‌ఈయూ కోశాధికారి నరేశ్‌గౌడ్, ఉపాధ్యక్షులు కూర కుల శ్రీనివాస్, మ్యాన పవన్, మల్లికార్జున్, పోల శ్రీనివాస్, కిరణ్, లింగమూర్తి, నరేందర్ రావు, శ్యామ్ సుందర్, రాష్ట్ర, జిల్లాల నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -