Saturday, May 23, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రమాదవశాత్తూ నిప్పంటుకుని మక్కపంట దగ్ధం 

ప్రమాదవశాత్తూ నిప్పంటుకుని మక్కపంట దగ్ధం 

- Advertisement -

నవతెలంగాణ – బల్మూరు 
మండలంలోని నల్లచెరువు సమీపాన వ్యవసాయ పొలంలో శనివారం మక్కపంటకు నిప్పు అంటుకొని దగ్ధమైన సంఘటన చోటు చేసుకున్నది. సంబంధిత రైతుల వివరాల ప్రకారం బల్మూరుకు చెందిన బక్కయ్య, అనంతవరం గ్రామానికి చెందిన వెంకటస్వామి ఇద్దరూ కలిసి రెండెకరాల్లో సాగు చేసుకుంటున్నారు. మక్క పంట పూర్తి అయ్యి ఏరుతున్న సమయంలో ప్రమాదవశాత్తూ అగ్ని ప్రమాదం జరిగిందని తెలిపారు. ఎకరన్నర భూమిలో మక్కపంట తీశామని, మిగతా అర్ధ ఎకరంలో 10 గుంటల వరకు పూర్తిగా మక్కపంట అగ్ని ప్రమాదంలో కాలిపోయిందని వారు ఆవేదన చెందారు. దీంతో మాకు రూ.50,000 ల వరకు నష్టం జరిగి ఉంటుందని రైతులు వాపోయారు. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో వచ్చి మంటలను ఆర్పడంతో పూర్తి నష్టం తగ్గిందని రైతులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -