నవతెలంగాణ నిజామాబాద్ సిటీ :
నిజామాబాద్ జిల్లాలో ప్రయివేట్, కార్పొరెట్టి విద్యాసంస్థలు, స్కూల్స్ గుర్తింపు లేకుండా అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని నిజామాబాద్ జిల్లా విద్యాధికారికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏఐఎస్బి రాష్ట్ర ఉపాధ్యక్షులు మహేష్ మాట్లాడుతూ వచ్చిన ర్యాంకిలే కాకుండా లేని ర్యాయలను సృష్టించి విద్యార్థులను, వారి తల్లిల్లిదండ్రులను ఆకర్షించే విధంగా పునుకుంటున్నారు అని అన్నారు. విద్య హక్కు చట్టంను అమలు చేయడం లేదు. వెంటనే వాటిపై చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా ఆకాష్ బైజూస్ ఇనిస్ట్యూట్ లో నిబంధనలు అంతుస్తూ ప్రస్తకాలను అమ్ముతూ, ఫీ కార్ని బోర్డ్లో ప్రదర్శించకపోవడం, అలుగే పనిచేసే కార్మికులకు పీఎఫ్, ఇఎస్ఐ సౌకర్యాలు కల్పించకపోవడం, నిజామాబాద్ జిల్లాలోని 5,6 ర్యాంకులే కాకుండా వివిఖ రాష్ట్రాలు ర్యాంకులను చూపుతూ. విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ఆకర్షింప చేయడానికి పూసుకుంటున్నారు అని ఆరోపించారు. ఆకాష్ బైజుస్ గుర్తింపు రద్దుచేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పిడిఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి కర్క గణేష్ , ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు అనిల్, ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి రఘురాం, టీవీయువి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ లాల్ సింగ్, పిడిఎస్యు జిల్లా ఉపాధ్యక్షులు అషుర్ లు పాల్గొన్నారు.
