లైఫ్ ఆస్పత్రి పై చర్యలు తీసుకోవాలి

నవతెలంగాణ- కామారెడ్డి
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని లైఫ్ ఆసుపత్రి పై చర్యలు తీసుకోవాలని మంగళవారం నవ తెలంగాణ రామారెడ్డి విలేకరి తిరుపతి డి ఎం అండ్ హెచ్ ఓ లక్ష్మణ్ సింగ్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా తిరుపతి మాట్లాడుతూ….. గత ఏప్రిల్ 18వ తేదీన పొలం దగ్గర ప్రమాదవశాత్తు జారి పడగా, లైఫ్ ఆస్పత్రిలో చేరగా, మనికట్టు వద్ద విరిగిందని, మోచేతిలో కీలు తప్పిందని వైద్యం చేయగా, మూడు నెలలు అవుతున్న చేయి నొప్పి పోకపోవడం, చేతు కదలికలు రాకపోవడంతో, హైదరాబాదులోని కిమ్స్ ఆస్పత్రిలో వైద్యుని సంప్రదించగా, మోచేతిలో విరిగిన ఎముకలను తొలగించకపోవడంతో సమస్య ఉందని, మళ్లీ శాస్త్ర చికిత్స నిర్వహించారని, లైఫ్ ఆస్పత్రిలో చేసిన వైద్యులు శివ పేరు మీద డిశ్చార్జి సమ్మరీ అందజేశారని, వైద్యం చేసినప్పుడు శివ ఎవరో తెలియదని, అర్హత లేనివారు సర్జరీ చేయడం, వైద్య సేవలు చేయటం ఆస్పత్రిలో జరుగుతుందని, ఆస్పత్రి పై, వ్యక్తులపై చర్య తీసుకోవాలని, ఇలాంటి లైఫ్ ఆసుపత్రి, ప్రజల జీవితాలతో ఆడుకుంటుందని ప్రజా ప్రతినిధులు, అధికారులు వెంటనే చర్యలు తీసుకొని, ప్రజల ఆరోగ్యాలను కాపాడాలని కోరారు.
Spread the love