కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలి..

– పార్టీ కార్యాలయం ప్రారంభించిన జిల్లా ఒలంపిక్ సంఘం ఉపాధ్యక్షులు
– బాజిరెడ్డి జగన్ మోహన్..
నవతెలంగాణ డిచ్ పల్లి:
ఇందల్ వాయి మండల కేంద్రంలో సోమవారం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని జిల్లా యువ నాయకులు, ఒలంపిక్ జిల్లా ఉపాధ్యక్షులు, దర్పల్లి జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ మోహన్, ఎంపీపీ భదవత్ రమేష్ నాయక్, డీసీయంయస్ చైర్మన్ సంబారి మోహన్, పార్టీ మండల అధ్యక్షులు చిలువేరి దాస్ ఇతర నాయకులు, ప్రజా ప్రతినిధులతో కలిసి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా బాజిరెడ్డి జగన్ మోహన్ మాట్లాడుతూ ప్రతి కార్యకర్త సైనికుల బీఆర్ఎస్ పార్టీ కోసం పని చేయాలన్నారు. కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు పార్టీ ఎళ్ఇళవేళల
ఎళ్ళవేళల గుర్తిస్తుందన్నారు. త్వరలో జరుగనున్న ఎన్నికల్లో  గ్రామాల్లోకి ప్రతిపక్ష పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ నాయకులు వచ్చి కల్లబొల్లి మాటలు చెబుతారని వారి మాటలు నమ్మొద్దన్నారు. ఎన్నికల్లో గ్రామాల్లోని ప్రజలకు సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించాలని, ఇప్పటికే కనివిని ఎరుగని రీతిలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ విశేష కృషి చేశారని, ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలు అందజేయడం జరిగిందని వాటన్నింటినీ ప్రజలకు వివరిస్తూ ఉండె విధంగా చూడాలని సూచించారు. రూరల్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ ను మూడోసారి లక్ష మెజార్టీతో గెలిపించేలా ప్రతి కార్యకర్త పని చేయాలన్నారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ భూసాని అంజయ్య, బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి పులి శ్రీనివాస్, ఉపాధ్యక్షులు బిరిష్ శేట్టి, సర్పంచ్ ల ఫోరం మండల అధ్యక్షులు లోలం సత్యనారాయణ, సొసైటీ చైర్మన్ చింతలపల్లి గోవర్ధన్ రెడ్డి, రూరల్  ఎస్సీ సెల్ కన్వీనర్ పాశంకుమార్, ఎంపీటీసీలు చింతల దాసు, సుధాకర్, సి హెచ్ దాస్, ప్రవీణ్ గౌడ్,మండల కో ఆప్షన్ సభ్యులు షేక్ హుస్సేన్,పాశం నర్సింలు, సర్పంచ్ నరేష్, తెలు విజయ్ కుమార్,
అంబర్ సింగ్, రాజు నాయక్, కచ్చకాయల శ్రీనివాస్, గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.
Spread the love