తిరుపతిలో లెవల్ 3 ఆఫ్-సైట్ ఎమర్జెన్సీ మాక్ డ్రిల్‌ని నిర్వహించిన ఏజి & పి ప్రథమ్

నవతెలంగాణ-హైదరాబాద్ : అత్యవసర పరిస్థితులు ఎదురైనప్పుడు వేగంగా ప్రతిస్పందించే తీరును మెరుగుపరిచే  ప్రయత్నంలో, ఇండియన్ సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ (CGD) విభాగంలో ప్రముఖ సంస్థ ఏజి & పి ప్రథమ్ సంస్థ (AG&P Pratham) , లెవల్ 3 మాక్ డ్రిల్‌ని విజయవంతంగా నిర్వహించింది. తిరుపతి జిల్లా రేణిగుంట మండలం గాజులమంధ్యంలోని కంపెనీ COCO స్టేషన్‌లో ఈ  డ్రిల్ నిర్వహించారు. ఈ  డ్రిల్ యొక్క ప్రాథమిక లక్ష్యం స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ (ఎస్ఓపిలు) గురించి అవగాహన పెంచడం , ఎమర్జెన్సీకి ముందు మరియు అనంతర దశలలో ప్రతిస్పందన విధానాల ప్రభావాన్ని అంచనా వేయడం. డ్రిల్ సందర్భంగా గాజులమంధ్యం ఎస్‌ఐ సునీల్‌ మాట్లాడుతూ గ్యాస్‌ లీకేజీ, అగ్ని ప్రమాదాల గురించి ప్రతి ఒక్కరికీ తగిన అవగాహన కల్పించాలన్నారు.  ప్రమాదవశాత్తు గ్యాస్ లీక్‌లు మరియు అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు, ముఖ్యంగా సిఎన్‌జి వాహనం గ్యాస్ లోడ్‌తో రోడ్డుపై ఉన్నప్పుడు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరాన్ని ఆయన తో పాటుగా అగ్నిమాపక సిబ్బంది మరియు ఫ్యాక్టరీ కార్మికులు నొక్కి చెప్పారు. గ్యాస్ లీకేజీ మరియు అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు ఎలా వ్యవహరించాలో ప్రజలకు అవగాహన కల్పించడానికి ఏజి & పి ప్రథమ్ సంస్థ (AG&P Pratham)  ఈ మాక్ డ్రిల్‌ను నిర్వహించింది.  ERDMP ప్రణాళిక ప్రకారం గ్యాస్ లీకేజీ అత్యవసర ఉపశమన పద్ధతులను అంచనా వేయడానికి డిప్యూటీ రీజినల్ హెడ్ సందీప్ మిస్త్రీ, ఆపరేషన్స్ మేనేజర్ డి . శ్రీను మరియు సేఫ్టీ ఆఫీసర్ శబరి బాబుతో సహా ఏజి & పి ప్రథమ్ సంస్థ (AG&P Pratham)  బృందంలోని ముఖ్య సభ్యులు హాజరయ్యారు. మాక్ డ్రిల్‌లో గాజులమండ్యం పోలీసు శాఖ, తిరుపతి అగ్నిమాపక శాఖ మరియు ఫ్యాక్టరీల శాఖతో సహా స్థానిక అధికారులు కూడా పాల్గొన్నారు. శ్రీ  గౌతమ్ ఆనంద్, రీజనల్ హెడ్ & అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్, ఏజి & పి ప్రథమ్ సంస్థ (AG&P Pratham) , సివికె జిఎ మాట్లాడుతూ, ” గ్యాస్ లీకేజీ మరియు అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు ఎలా వ్యవహరించాలో ప్రజలకు అవగాహన కల్పించడానికి మేము ఈ మాక్ డ్రిల్‌లను నిర్వహిస్తుంటాము. సహజవాయువు కాబట్టి లీకైన వాయువు హానికరం కాదు, అయినప్పటికీ మా బృందం ఏదైనా అనూహ్యమైన పరిస్థితులను వేగంగా నిర్వహించగలదని మరియు సమాజానికి కలిగే అసౌకర్యాలను తగ్గించగలదని నిర్ధారించుకోవడానికి క్రమం తప్పకుండా ఈ కసరత్తులను నిర్వహిస్తాము” అని అన్నారు.

Spread the love