పోక్సో బాధితురాలును పరామర్శించిన ఐద్వా రామేశ్వరి

నవతెలంగాణ – చౌటుప్పల్ రూరల్
ఇటీవలే రెండేళ్ల  చిన్నారిని అత్యాచారం చేసిన నిందితుడిని శిక్షించాలని కోరుతూ గురువారం ఐద్వా చౌటుప్పల్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో అత్యాచారానికి గురైన రెండేళ్ల చిన్నారిని పరామర్శించారు. జరిగిన సంఘటన గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. బతుకుతెరువు కోసం ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం శివారులో కంపెనీలో పని చేయడానికి అనేక కుటుంబాలు వలస వచ్చాయి. అభంశుభం తెలియని రెండేళ్ల చిన్నారిని చిదిమేసిన నిందితుడిని పోక్సో చట్టం కింద శిక్షించాలని యాదాద్రిభువనగిరి జిల్లా ఐద్వా కమిటీ అధ్యక్షురాలు అవ్వారు రామేశ్వరి డిమాండ్ చేశారు. ఇటువంటి సంఘటనలు ప్రతి చోట జరుగుతున్న ప్రభుత్వం సరైన శిక్షలు వేయకుండా ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయని రామేశ్వరి అన్నారు. సమాజంలో ప్రతి మహిళలపై ఇటువంటి సంఘటన జరుగుతున్న నిమ్మకు నీరెత్తినట్టు ప్రభుత్వం వ్యవహరిస్తుందని అవ్వారు రామేశ్వరి ఖండించారు. ప్రభుత్వం స్పందించి ఇప్పటికైనా చిన్నారిని ఆదుకోవాలని అవ్వారు రామేశ్వరి ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో అండాలు, జయమ్మ,రేష్మి,గోవర్ధన్,శ్రీను తదితరులు పాల్గొన్నారు.
Spread the love