చైతన్య ఇంజనీరింగ్ కాలేజ్‌లో విద్యార్థిని ఆత్మహత్య..

నవతెలంగాణ-హైదరాబాద్ : విశాఖపట్నం కొమ్మాది చైతన్య ఇంజనీరింగ్ కాలేజ్‌లో డిప్లమో ఫస్ట్ ఇయర్ చదువుతున్న రూప శ్రీ కాలేజ్ ఫాకల్టీ లైంగిక వేదింపులు భరించలేక శుక్రవారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. కళాశాల భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. కళాశాల ఫ్యాకల్టీ అసభ్యకరంగా ఫోటోలు తీసి బ్లాక్ మెయిల్ చేయడమే ఇందుకు కారణమని తెలిసింది. ఈ మేరకు రూప శ్రీ లేఖ రాశారు. ‘అసలు నేను ఆత్మహత్య చేసుకోవటానికి కారణం ఏంటి అంటే ఈ కాలేజీలో లైంగిక వేధింపులు జరుగుతున్నా నాన్నా….మరి ఫ్యాకల్టీకి చెప్పొచ్చు కదా అని మీరు అనుకోవచ్చు కానీ ఆ ఫ్యాకల్టీలోని ఒకరు అని అంటే ఇంకేం చెప్పగలము నాన్నా…చాలా చెండాలంగా ప్రవర్తిస్తున్న ఫోటోలు కూడా తీసుకుని బెదిరిస్తున్నారు నాన్న .. విద్యార్థులకు ఫ్యాకల్టీ చెప్పవలసింది పోయి ..ఆ ఫ్యాకల్టీ ఆ స్టూడెంట్స్‌ని ప్రోత్సహిస్తే ఇంకా ఎవరికి చెప్పాలి నాన్న ? నా ఫోటోలు కూడా తీసుకుని బెదిరిస్తున్నారు నాన్న..ఇంకా నాకు ఒక్కదానికే కాదు ఇంకా కాలేజ్‌లో చాలా మంది అమ్మాయిలు ఉన్నారు నాన్న..ఎవరికి చెప్పుకోలేక…అలా అని కాలేజీకి వెళ్లలేక మధ్యలో నలిగిపోతున్నాం నాన్న…ఇదీ పోలీసులకు ఫిర్యాదు చేస్తే సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తామని బెదిరించారు నాన్నా…ఇంకా నాకు వేరే దారి కనిపించలేదు నాన్నా….ఎవరో ఒకరు చస్తేనే కానీ ఈ విషయం బయట ప్రపంచానికి తెలుస్తోంది…ఆ పని నేనే చేస్తున్నా నాన్నా.. నన్ను క్షమించండి… ’ అంటూ రూపశ్రీ లేఖలో పేర్కొన్నారు. పీఎం పాలెం పొలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Spread the love