ప్రతీ ఇంటికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం : చంద్రబాబు

నవతెలంగాణ-హైదరాబాద్ : ప్రతీ ఇంటికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందజేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. ఇవాళ కావలిలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. ముఖ్యంగా అన్నదాత రైతు ఎక్కడ బాగుంటే ఆ రాష్ట్రం సుబిక్షంగా ఉంటుంది. రైతు బాధ పడితే.. ఆ రాష్ట్రం బాగుపడదు. టెక్నాలజీని ఉపయోగించి.. వ్యవసాయాన్ని లాభసాటిగా చేస్తాం. సబ్సీడీ, గిట్టుబాటు ధర కల్పిస్తామన్నారు. యువతకు 20లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత నాదే అన్నారు. సంవత్సరానికి 4 లక్షలు.. 5 సంవత్సరాలకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాను. 9 డీఎస్సీలు పెట్టాను. రాష్ట్రంలో ఐదేళ్లలో ఒక్క డీఎస్సీ అయినా పెట్టాడా..? అని ప్రశ్నించారు. టీడీపీ 12 డీఎస్సీలు పెట్టావో చెప్పమని సవాల్ విసిరుతున్నాను. జాబ్ క్యాలెండర్ ఇస్తాను.. గ్రూపు 1 సర్వీసులను అమ్ముకున్నాడు జగన్.. పేద పిల్లలు ఉన్నత విద్యనభ్యసించేలా ప్రోత్సహించామని తెలిపారు. ఈ ప్రభుత్వాన్ని చిత్తు చిత్తుగా ఓడిద్దామన్నారు. ఇక్కడ ఇద్దరూ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులున్నారు.. వారిని గెలిపించే బాధ్యత మీదే. రూ.200 పింఛన్ ను 1000 చేశాం.. దానిని మళ్లీ 2000 పెంచానని తెలిపారు.

Spread the love