నవతెలంగాణ-తాండూరు
తాండూరులో మంగళవారం ఏఐటీయూసీ కార్మిక సంఘం వ్యవస్థాపన దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తెలిపారు. తాండూరులో సీసీఐ సిమెంట్ ఫ్యాక్టరీ, పెన్నా, ఫ్యాక్టరీల, మున్సిపల్ కార్యాలయం వద్ద, ఏఐటీయూసీ జండా లను ఎగురవేశారు. ఏఐటీయూసీ కార్మిక సంఘం వ్యవస్థాపక దినోత్సవ సందర్భంగా వికారాబాద్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ విజయలక్ష్మి పండిత్ కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. 1920,అక్టోబర్ 31 నాడు, కార్మిక సంఘాన్ని లాల లజపతిరారు మొదటి అధ్యక్షునిగా బొంబాయిలో స్థాపించారన్నారు. ఒకవైపు భారత దేశ స్వాతంత్రం కోసం పోరాడుతూనే, కార్మికుల హక్కుల కోసం పో రాటాలు చేసి, 8 గంటల పని దినాన్ని సాధించారనీ, అంతకుముందు కార్మికులు బానిసలుగా పనిచేసే వ్యవస్థ ఉండేది. ఎన్నో చట్టాలను, హక్కులను కార్మికుల కోసం పోరాడి సాధించుకున్నారన్నారు. ఈ ప్రాంతంలో ఏఐటియుసి కార్మికుల కోసం ఎన్నో పోరాటాలను నిర్మించి, హక్కులను సాధించార న్నారు. పొట్లూరి నాగేశ్వరరావు, వారి త్యాగాలను గుర్తుచేశారు. దేశంలో పెట్టుబడిదారులకు అనుకూల ప్రభుత్వాలు, కార్మిక చట్టాలను తీసివేసే ప్రయత్నం గురించి తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థలన్నింటిని ప్రయివేటు వ్యక్తులకు అమ్మి కార్మికులకు అన్యాయం చేస్తున్నారని, ఎర్రజెండా ఈ దేశంలో కనిపించ కుండా, కార్మికుల గొంతు మూగ పోయేలా చేసే ఆలోచనలో కొంతమంది పెట్టుబడిదారులు, దేశాన్ని శాసిస్తున్నారన్నారు. దేశంలో పేదరికం ఉన్నం తవరకు కార్మికులకు అన్యాయం జరుగుతున్నంత వరకు వారికి హక్కులు సాధించేంతవరకు ఈ ఎర్రజెండా ఖచ్చితంగా ఉంటుందని, సమ, సమాజ స్థాపన, అందరికీ సమ న్యాయం జరిగేంతవరకు ఈ ఎర్రజెండా పేద కార్మిక ప్రజల పక్షాన వెన్నంటి ఉం టుందన్నారు. ఎంతోమంది నాయకులు ప్రాణ త్యా గాలు చేశారని, వారే తమకు ఆదర్శమని కార్మికుల రక్తంతో పుట్టిన ఎర్రజెండాను లేకుండా చేయడం అనేది ఎవరికి సాధ్యం కాదని, ఇటువంటి వాళ్ళు కాలగర్భంలో కలిసిపోతారని, ఆమె హెచ్చరించారు. కార్యక్రమంలో హేమంత్ బాల శంకర్ గౌడ్, వంశీకృష్ణ, మునీర్ అహ్మద్, శంకర్, శేఖర్, ఇస్మాయి ల్, వెంకటేష్, రవీందర్, దశరథ్ గౌడ్, గోపాల్, విజరు, దస్తప్ప, రాజేందర్, నర్సింలు, అశోక్, విజయలక్ష్మి, దేవి, మొగలమ్మ, దస్తప్ప, బుజ్జ మ్మ, విజరు, తదితరులు కార్మికులు పాల్గొన్నారు.