గంభీర్‌ రాక ఆటగాళ్లకు హెచ్చరికే: ఆకాశ్ చోప్రా

నవతెలంగాణ – హైదరాబాద్: టీమ్ఇండియా కోచ్‌గా గంభీర్ ఎంపిక దాదాపు ఖాయమైనట్లేనని, సీనియర్ ప్లేయర్లకు అతడి రాక హెచ్చరికవంటిదని మాజీ ఆటగాడు ఆకాశ్ చోప్రా అన్నారు. ‘కోచ్‌గా కన్ఫామ్ అయితే 2027 వన్డే ప్రపంచకప్ వరకూ గంభీర్ కొనసాగొచ్చు. రోహిత్, విరాట్, షమీ, జడ్డూ వంటి స్టార్ ఆటగాళ్ల వయసు అప్పటికి 40కి దగ్గర్లోకి చేరుతుంది. ఈ నేపథ్యంలో గౌతీ కఠిన నిర్ణయాలను తీసుకోవాల్సి ఉంటుంది. ఆయన పదవీకాలం చాలా ఆసక్తిగా ఉండనుంది’ అని పేర్కొన్నారు.

Spread the love