అక్బరుద్దీన్‌ చెప్పిన సత్యం!

హైదరాబాద్‌ అంటే ముందుగా గుర్చొచేది చార్మినార్‌. ఆ తర్వాత ఎన్నో చారిత్రాత్మక కట్టాలు. వీటితోపాటు హైటెక్‌సిటీ. వీటిని చేసేందుకు దేశ, విదేశాల నుంచి పర్యటక ప్రేమికులు వస్తుంటారు. పోతుంటారు. అటువంటి పర్యటకులకు హైదరాబాద్‌ అనగానే మరొకటి గుర్తొస్తుంటుంది. వామ్మో హైదరాబాద్‌ ట్రాఫిక్‌ అని గుండెలు బాదు కుంటారు. ట్రాఫిక్‌ రద్దీని నియంత్రించేందుకు ఆయా ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటున్నాయి. ఉపాధి, ఉద్యోగ, వ్యాపార అవకాశాలకు నగరానికి వస్తున్న నేపథ్యంలో పట్టణీకరణ కూడా పెరుగుతున్నది. అందుకే ట్రాఫిక్‌ సమస్య పెను సవాల్‌గా మారింది. మొన్నటికి మొన్న పెద్ద వాన పడితే దాదాపు మూడున్నర గంటలపాటు ట్రాఫిక్‌ జామ్‌తో జనం అల్లాడిపోయారు.ఇలాంటి పరిస్థితిని రోజు గమనిస్తున్న ఎంఐఎం నేత, చంద్రాయన్‌గుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఇటీవల అసెంబ్లీలో ఓ సత్యం చెప్పారు. ట్రాఫిక్‌ నియంత్రణలో పోలీసుల వైఫల్యం ఉందని ఘంటా పదంగా చెప్పుకొచ్చారు. ఎక్కడైతే ట్రాఫిక్‌ పోలీసులు అప్రమత్తంగా విధులు నిర్వహిస్తారో అక్కడ ట్రాఫిక్‌ నియంత్రణ బాగా జరుగుతుందని చెప్పారు. ఎక్కడైతే సెల్‌ఫోన్లో నిమగమై ఉంటున్నారో అక్కడ ప్రయాణికులు హద్దులు దాటు తున్నారు. ట్రాఫిక్‌ పోలీసులు కూడా సీసీ కెమోరాలను నమ్ముకుని తమ డ్యూటీలను మరచిపోతున్నారు. సెల్‌ఫోన్లో వీడియోలు చూస్తూ…కూర్చొంటున్నారని హాట్‌ కామెంట్‌ చేశారు. ఎందుకంటే ప్రతి చౌరస్తా పోలీసుల కంట్రోల్‌లో ఉంటే అక్కడ ప్రమాదాలు తక్కువగా ఉన్నాయి. ట్రాఫిక్‌ జామ్‌లు కావు. స్పీడ్‌ రైడర్స్‌ కూడా ఒళ్లు దగ్గర పెట్టుకుని ఉంటారు. ప్రతిఒక్క ప్రయాణికుడి మనోగతం కూడా అదే.
– గుడిగ రఘు

Spread the love