వెళ్లిపోతున్నా…!

‘వెళ్తున్నా… వెళ్తున్నా… దూరంగావెళ్తున్నా… వెళ్లిపోతున్నా..ఇక నేనెళ్లిపోతున్నా..!’, అయ్యో బాలి..బాలి.. నేనున్న బ్యాంకు మరిచి..నేను పడుకున్న లాకర్‌ మరిచి పోతున్న బాలి..బాలి’ అంటూ సోషల్‌మీడియాలో మీమ్స్‌ తెగ వైరల్‌ అవుతున్నాయి. ఇంతకు దేని గురించి అనుకుంటున్నారా? గదే రెండువేల రూపాయల నోటు గురించి. నల్లధనాన్ని అరికట్టేందుకు అంటూ మోడీ సర్కారు 2016లో నోట్లను రద్దుచేసింది. పెద్దనోట్లతోనే అవినీతికి ఎక్కువ ఆస్కారం ఉందంటూ ఊదరగొట్టింది. సామాన్యులను అరిగోస పెట్టించింది. చావులకూ కారణమైంది. ఇది నాణానికి ఒకవైపు మాత్రమే. మరోవైపు పరికించి చూస్తే పెద్దనోట్ల రద్దు కార్పొరేట్లకు ఎంతో ఉపయోగ పడింది. నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకోవడానికి దోహదపడింది. ఇలా నోట్ల రద్దు ఓ ప్రవాసనంగా మారింది. దేశ ఆర్థిక వ్యవస్థకే పెను నష్టదాయకం చేసింది. పెద్దనోట్ల రద్దుతో మొదలైన సామాన్యుల ఆర్థిక కష్టాలు రోజురోజుకీ పెరిగిపోతూనే ఉన్నాయి. ఇందులో టిస్టేంటంటే… ఏడేండ్ల కిందట చిన్న నోట్లను రద్దుచేసి పెద్ద నోటును తీసుకొచ్చారు… ఇప్పుడేమో గ పెద్ద నోటునే రద్దుచేశారు. అసలు ప్రవేశపెట్టుడేంది..రద్దు చేసుడేంది! జనానికేం సమజైతలేదు!
– నిరంజన్‌ కొప్పు

Spread the love