జపాన్ పర్యటనకు బయలుదేరుతున్న అల్ఫోర్స్  విద్యార్థిని

నవతెలంగాణ – కరీంనగర్ 
విధ్యార్థులకు నాణ్యతమైన విద్యనందించడమే కాకుండా వివిధ స్థాయిల్లో నిర్వహింపబడే పలు ప్రదర్శనల్లో పాల్గొనటానికి ఆవకాశం ఇవ్వడం వలన వారు చాలా గొప్పగా ఉంటారని మరియు అగ్రశ్రేణిలో కొనసాగడానికి అవకాశం పొందవచ్చని అల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డా. వి. నరేందర్ రెడ్డి , ఛైర్మన్, స్థానిక కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అల్ఫోర్స్ విద్యాసంస్థల కేంద్ర కార్యాలయంలో ఆల్ఫోర్స్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్క చెందినటువంటు ఎం. పూజశ్రీ జపాన్ లోని సదూర పర్యటన అవకాశం పొందడం పట్ల ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక సమావేశానికి ముఖ్య అతిథిగా హజరై మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులకు ప్రపంచ ప్రమాణాలకు ధీటుగా అపూర్వ అనుభవం కల్గిన ఉపాధ్యాయులచే చాలా అత్యుత్తమ విషయాలు భోధించడం జరుగుతున్నదని చెప్పారు. అంతకు అనుగుణంగా చాలా ఆద్భుతమైన ఫలితాలు సాధించడం జరుగుతుందని చెప్పారు. ఆద్భుతమైన విజయాలలో భాగంగా పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లోని అల్ఫోర్స్ స్కూల్ ఆఫ్ జెన్నెక్ట్స్ విద్యార్థిని ఎం. పూజశ్రీ జాతీయ స్థాయి ఇన్స్పైర్ ఆవార్డ్స్ తను ప్రదర్శించిన వీల్ ఆక్సిల్ కెమెరా ఆకట్టుకున్నదని మరియు సృజనాత్మకంగా తయారు చేయబడినదని న్యాయనిర్ణేతలు తెలిపారని చెప్పారు. జాతీయ స్థాయిలో అత్యుత్తమ ప్రదర్శనకుగాను జపాన్లోని సకురలో పాల్గొనడానికై ఆవకాశం కైవసం చేసుకున్నదని హర్షం వ్యక్తం చేసారు. విద్యార్థిని రూపోందించిన నమూనా  రాష్ట్రపతి ద్రౌపది మూర్ము గారు కూడా పరిశీలించడం జరిగినదని , విద్యార్థిని అభినందించడం జరిగిందని చెప్పారు.
భారతదేశం తరుపున మే 19 నుండి 25 సకురలో పలువురు ఖ్యాతిగాంచిన శాస్త్రవేత్తల ప్రత్యక్ష పర్యవేక్షణలో ప్రదర్శన ఇవ్వబోతున్నదని ఇంతటి ప్రతిష్టాత్మక అవకాశాన్ని పొందిన తెలంగాణలో నుండి రెండో విద్యార్థిని అని చెప్పారు . నిర్వహింపబడే ప్రదర్శనలో అద్భుతంగా రాణించాలని మరియు ప్రపంచ దృష్టిని సైతం ఆకర్షించుకోవాలని చెప్పారు.విద్యార్థిని ఎంపిక పట్ల పెద్దపల్లి డి.ఇ.ఓ. మాధవి , డి.ఎస్, ఓ. రవీనందన్రావు పలువురు సైన్స్ ఉపాధ్యాయులు అభినందించారు. పర్యాటనకు బయలుదేరే విద్యార్థినికి పుష్పగుచ్చన్ని అందజేసి విదేశాలలో సైతం గణవిజయం సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, తలితండ్రులు  పలువురు విద్యార్థులు పాల్గొన్నారు.
Spread the love