ఇష్టపడి చదివి లక్ష్యాలను సాధించాలి: అల్జాపూర్ శ్రీనివాస్

నవతెలంగాణ – ఆర్మూర్ 
విద్యార్థులు ఇష్టపడి చదివి ర్యాంకులు సాధించి అనుకున్న లక్ష్యాలను సాధించాలని క్షత్రియ సమాజ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అల్జాపూర్ శ్రీనివాస్ అన్నారు. పట్టణంలోని క్షత్రియ కళ్యాణ మండపంలో ఆదివారం క్షత్రియ సమాజ్ అధ్యక్ష కార్యదర్శులు రెడ్డి ప్రకాష్, బారడ్ గంగా మోహన్ ఆధ్వర్యంలో ఉత్తమ విద్యార్థుల ప్రతిభ పురస్కార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరై ఆయన మాట్లాడుతూ సరస్వతి ఉంటే లక్ష్మి దానంతట అదే వస్తుందని పేర్కొన్నారు. పిల్లల ఆలోచనల మేరకే తల్లిదండ్రులు ముందుకు సాగాలని చెప్పారు. చదువుకోవాలని మానసికంగా ఒత్తిడి తీసుకొని రావద్దని వారికి ఇష్టమైన కోర్సులలో చేర్పించి ప్రోత్సహించాలన్నారు. క్షత్రియ సంఘానికి చెందిన విద్యార్థులు కష్టపడి చదివి మంచి పేరు సంపాదించి అందరి ఆధారాభిమాన లకు పాత్రులు కావాలన్నారు. పదో తరగతి, ఇంటర్ లో మంచి మార్కులు సాధించి సన్మానం పొందుతున్న విద్యార్థులకు అభినందించారు.
  పదో తరగతి, ఇంటర్ లోనీ ఉత్తమ విద్యార్థులకు పూలమాలలు, శాలువా, మెమొంటో, ప్రశంసా పత్రం, మెడల్స్ తో ఘనంగా సన్మానం చేశారు. క్షత్రియ సమాజ్, యువజన సమాజ్ ఎన్నికలను నిర్వహించిన కమిటీ సభ్యులతో పాటు ఎన్నికల విధులు నిర్వహించిన అధికారులకు శాలువా, మెమొంటోలతో ఘనంగా సన్మానం చేశారు. కార్యక్రమ కన్వీనర్ గా ఘటడి రాజేష్, కో కన్వీనర్ గా సాత్ పుతే గణేష్ గౌరవ్ వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో క్షత్రియ సమాజ్ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి కాందేశ్ శ్రీనివాస్, రాష్ట్ర కార్యదర్శి పండిత్ ప్రేమ్, కౌన్సిలర్ సంగీత కాందేశ్, సలహాదారులు దోండి బుడ్డు శంకర్, పడాల్ గణేష్, రిటైర్డ్ తహసిల్దార్ కర్తన్ కిషన్, రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ బాదాం స్వామి, సమాజ్ ఉపాధ్యక్షులు జెస్సు ఆనంద్, డీకే శ్రీనివాస్, సంయుక్త కార్యదర్శులు సంతని విజయ్, బారడ్ కిషోర్, యువజన సమాజ్ అధ్యక్ష కార్యదర్శులు సాత్ పుతే సంతోష్, దుమాని నీరజ్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love