తెలంగాణ ఆర్గానిక్ మేళకు రైతులందరూ తరలి రావాలి

నవతెలంగాణ మోపాల్: శుక్ర ,శని ,ఆదివారంలో కలిల్ వాడిలో గల రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో జరుగుతున్న తెలంగాణ ఆర్గానిక్ మేళకు రైతులందరూ తరలిరావాలని, ఈ మేళా సాయి వెజిటేబుల్స్ మరియు నాబార్డ్ వారి ఆధ్వర్యంలో జరుగుతుందని ఇది రైతుల కోసం ఏర్పాటు చేసిందని, రైతులను వివిధ రకాల కెమికల్ వస్తువుల నుండి దూరం చేసి కేవలం ఆర్గానిక్ వస్తువుల వైపు మళ్ళించడానికి వివిధ రకాల స్టాలన్ ఏర్పాటు చేయడం జరిగిందని. ఈ సందర్భంగా పీఆర్ఓ సాయినాథ్ మాట్లాడుతూ లాభాపేక్ష లేకుండా రైతుల ఆరోగ్యం కొరకు మరియు భావితరాల భవిష్యత్తు కొరకు ఏర్పాటు చేయబడిందని, మనం తినే ఆహారంలో నాణ్యత లేకుండా కెమికల్ సంబంధించి ఆహారాన్ని తీసుకోవడం వల్ల దీర్ఘకాలిక వ్యాధులు వస్తూ మన జీవిత కాలమానం తగ్గిపోతుందని, ఇప్పటికైనా ప్రజలందరూ ఆలోచించి ఆర్గానిక్ వైపు వెళ్లాలని మనతో పాటు పదిమందికి చెప్పి వారి ఆరోగ్యానికి సహాయ పడాలని అలాగే మోపాల్ మండల కేంద్రంలో గల వివిధ గ్రామాల నుండి అధిక మొత్తంలో రైతులు హాజరుకావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కొండల్ సాయి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Spread the love