విద్యార్థులంతా ఉన్నత లక్ష్యంతో చదవాలి

– పేద విద్యార్థులకు అండగా ఎంఎన్‌ఆర్‌ యువసేన ఫౌండేషన్‌
– కాంగ్రెస్‌ ఇబ్రహీంపట్నం నియోజకవర్గ నాయకులు మర్రి నిరంజన్‌రెడ్డి
నవతెలంగాణ-యాచారం
విద్యార్థులంతా చిన్నతనం నుంచే ఉన్నత లక్ష్యంతో చదవాలని కాంగ్రెస్‌ ఇబ్రహీంపట్నం నియోజకవర్గ నాయకుడు మర్రి నిరంజన్‌ రెడ్డి అన్నారు. మంగళవారం యాచారం మండల పరిధిలోని గున్‌గల్‌ మోడల్‌ స్కూల్‌, నందివనపర్తి, మేడిపల్లి, కొత్తపల్లి, యాచారం, చింతపట్ల, చిన్నతుండ్ల గ్రామాలకు చెందిన జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులకు ఎంఎన్‌ఆర్‌ యువసేన ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో స్టడీ మెటీరియల్స్‌ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులంతా కష్టంతో కాకుండా ఇష్టపడి చదవాలని సూచించారు. తమ తల్లిదండ్రులు కన్న కలలను నెరవేర్చే విధంగా లక్ష్యం వైపు నడవాలన్నారు. జరగబోయే పదోవ తరగతి పబ్లిక్‌ పరీక్షలో ప్రతి విద్యార్థి 10/10 పాయింట్లు సాధించి ప్రభుత్వ పాఠశాలల ఔన్నత్యాన్ని పెంచాలని చెప్పారు. కష్టపడి చదివి ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని వివరించారు. చిన్నతనం నుంచి విద్యా ర్థులంతా క్రమశిక్షణను అలవర్చుకోవాలని పేర్కొన్నారు. అనంతరం వివిధ పాఠశాలల్లో ఉపాధ్యాయ బృందం నిరంజన్‌ రెడ్డిని శాలువాతో ఘనంగా సన్మా నించారు. విద్యార్థులు ఆయనకు కృతజ్ఞత భావాన్ని తెలియజేశారు. ఈ కార్య క్రమంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, కాంగ్రెస్‌ నాయకులు దెంది రామ్‌రెడ్డి, ఉప్పల భాస్కర్‌, వెంకట్‌రెడ్డి, జయప్రకాష్‌, బుచ్చయ్య, శ్రీనివాస్‌ రెడ్డి, జంగారెడ్డి, టేకుల కమలాకర్‌ రెడ్డి, మహేష్‌గౌడ్‌, తిరుమల్‌ రెడ్డి, పాల్గొన్నారు.

Spread the love